సోషల్ మీడియాను పాజిటివ్ గా వాడుకునేవాళ్లు కన్నా నెగిటివిటిని ప్రచారం చేసే వాళ్లు ఎక్కువ అయ్యారు. నెగిటివ్ ని తట్టుకుని నిలబడటం చాలా కష్టమైపోతోంది. ముఖ్యంగా కోట్ల డబ్బుతో ముడిపడ్డ పెద్ద సినిమాల విషయంలో అది మరీను. లాస్ట్ ఇయిర్ మహేష్ బాబు గుంటూరు కారం సైతం ఈ ట్రోలింగ్ బారిన పడిపడిది.
ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీదా పడింది. కొందరు కావాలని ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నిర్మాత సైతం బాధపడ్డారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ అయితే ఈ ట్రోలింగ్ కి బలైపోయింది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ వంతు వచ్చింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయం ప్రక్కన పెడితే నెగిటివ్ ప్రచారం క్యాంపైన్ పెట్టి మరీ చేస్తున్నారు.