సమంత, పూజా హెగ్డేల చేయలేనంటోన్న సాయిపల్లవి.. ఐటెమ్‌ సాంగ్‌, ప్రేమపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Published : May 23, 2022, 07:52 PM IST

నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి సహజమైన నటన, డాన్సులతో అదరగొడుతుంది. ఆమె డాన్సులకు భాషలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ట్రెడిషనల్‌ లుక్‌లోనే ఆకట్టుకునే సాయిపల్లవి ఐటెమ్‌ సాంగ్‌లు చేయడం, ప్రేమపై స్పందించింది.   

PREV
15
సమంత, పూజా హెగ్డేల చేయలేనంటోన్న సాయిపల్లవి.. ఐటెమ్‌ సాంగ్‌, ప్రేమపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

సాయిపల్లవి(Sai Pallavi).. అంటేనే ఒక స్పెషల్‌. ఆమె హీరోయిన్‌గా అన్ని రకాల పాత్రలు చేయదు. చాలా సెలక్టీవ్‌గా ఉంటుంది. తనకు కంఫర్ట్ లేకపోతే ఎలాంటి సినిమా అయినా చేయదు, ఎంతటి పెద్ద హీరోతోనైనా చేయదు. `భోళా శంకర్‌`లో చిరంజీవికి చెల్లిగా పాత్రని రిజెక్ట్ చేయడంతోనే సాయిపల్లవి అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాదు ఆమె గ్లామర్‌రి మొదట్నుంచి దూరమే. 
 

25

బలమైన పాత్రల్లోనే నటించేందుకు ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. గ్లామర్‌కి దూరంగా ఉంటుంది. పొట్టి దుస్తుల్లో తాను కంఫర్ట్ గా ఉండలేనని చెబుతుంది సాయిపల్లవి. తాజాగా ఐటెమ్‌ సాంగ్‌లు చేయడంపై రియాక్ట్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

35

`రంగస్థలం`లో పూజా హెగ్డేలా `జిగేల్‌ రాణి`, `పుష్ప`లో సమంతలా `ఊ అంటావా మావ.. `వంటి ఐటెమ్‌ సాంగ్‌ల్లో నటించే అవకాశం వస్తే నటిస్తారా? అన్న ప్రశ్నకి సాయిపల్లవి నిర్మొహమాటంగా నో చెప్పింది. అలాంటి పాటల్లో నర్తించడం తనకు కంఫర్ట్ గా ఉండదని చెప్పింది. అలాంటి అవకాశాలు వస్తే, నో చెబుతానని తెలిపింది. మామూలుగా నటించే పాత్రల్లోనే డ్రెస్‌ కంఫర్ట్ గా లేకపోతేనే చాలా ఇబ్బంది ఫీలవుతానని పేర్కొంది.  ఐటెమ్‌ సాంగ్‌లు సినిమాల్లో ఒక ప్రత్యేకైన పర్పస్‌ కోసం పెడతారని, నాకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కంఫర్ట్ గా ఉండబోదని తెలిపారు. ఇప్పటి వరకు అలాంటి పాటలు చేయాలనే ఆలోచన రాలేదని తెలిపింది. మొత్తంగా హాట్‌గా కనిపించడం తన వల్ల కాదని చెప్పేసింది సాయిపల్లవి. 
 

45

ప్రేమ గురించి చెబుతూ, ప్రేమ ప్రతి మనిషికి అవసరం అని తెలిపింది. మనిషికి కెరీర్‌ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా అంతే అవసరం అని, ఈ రెండింటిలో ఏది లేకపోయినా లైఫ్‌ ఫుల్‌ ఫిల్‌ కాదని స్పష్టం చేసింది. అయితే ఆ మధ్య సాయిపల్లవిలో ప్రేమలో ఉందని, మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. 
 

55


ఎక్స్ పోజింగ్‌కి దూరంగా ఉండే సాయిపల్లవి బలమైన పాత్రలతో రక్తికట్టిస్తుంది. అద్భుతమైన డాన్సులతో ఉర్రూతలూగిస్తుంది. ఆమె కోసమే సినిమాలు చూసేంతగా తన పేరు, గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఇటీవల `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాలతో ఆకట్టుకున్న సాయిపల్లవి త్వరలో `విరాటపర్వం` చిత్రంతో రాబోతుంది. ఇది జులై 1న విడుదల కానుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కమల్‌ హాసన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తుంది, అలాగే `గార్గి` అనే బైలింగ్వల్‌ చిత్రానికి కమిట్‌ అయ్యింది సాయిపల్లవి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories