హీరోయిన్లు అప్పుడు పడుకున్నారు.. ఇప్పుడు కూడా పడుకుంటున్నారు.. దుమారం రేపుతున్న సీనియర్‌ దర్శకుడి వ్యాఖ్యలు

Published : May 23, 2022, 06:39 PM ISTUpdated : May 24, 2022, 06:59 AM IST

సీనియర్‌ దర్శకుడు గీతా కృష్ణ క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకి అవకాశాలు రావాలంటే పడుకోవాల్సిందే అంటే బోల్డ్ గా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.   

PREV
17
హీరోయిన్లు అప్పుడు పడుకున్నారు.. ఇప్పుడు కూడా పడుకుంటున్నారు.. దుమారం రేపుతున్న సీనియర్‌ దర్శకుడి వ్యాఖ్యలు

దర్శకుడు గీతా కృష్ణ నాగార్జునతో `సంకీర్తణ` చిత్రాన్ని రూపొందించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా వరుసగా యూట్యూబ్‌ ఇంటర్వ్యూలిస్తున్నారు. ఇందులో ఆయన బోల్డ్ గా స్పందిస్తుండటం విశేషం. హీరోయిన్లకి ఛాన్స్ లు రావాలంటే పడుకోవాల్సిందే అంటూ తేల్చిచెబుతున్నారు. అప్పుడు ఇది ఉందని, ఇప్పుడూ ఉందని, మున్ముందు కూడా ఉంటుందని చెప్పారు. 

27

ఆయన `సోషల్‌ పోస్ట్` అనే యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ, అప్పటికీ, ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ఉన్న తేడా ఏంటని ప్రశ్నంచగా, తేడా ఏం లేదని, హీరోయిన్లు అప్పుడు పడుకునేవారు, ఇప్పుడు పడుకుంటున్నారని బోల్డ్ గా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని తెలిపారు. హీరోయిన్ల కి అవకాశాలు రావాలంటే, వాళ్లు మంచి స్థానానికి వెళ్లాలంటే కచ్చితంగా హీరోలు, దర్శకులు, నిర్మాతల వద్ద పడుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు. అందరిని అలా అనలేమని, కొందరు ఇలాంటి వారు ఉంటారని తెలిపారు. ఇది సాఫ్ట్ వేర్ రంగంలోనూ ఉంటుందని చెప్పారు.

37

మోసం చేసే వాళ్లు అప్పుడు ఉన్నారు ఇప్పుడూ ఉన్నారని తెలిపారు. సినిమా చూసే జనాల ఆటిట్యూడ్‌ మారింది కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం ఏ మార్పు లేదని తెలిపారు. `నువ్వు కమిట్‌మెంట్‌ ఇచ్చావా? అని అడిగితే ఏ హీరోయిన్‌ కూడా అవును అని చెప్పదని, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇండస్ట్రీలో ఉందని, ఉంటుందని చెప్పారు. సెక్సువల్ కాంటాక్ట్ లో ఫేవర్ చేయడం అనేది అడ్వర్టైజింగ్ లో పుట్టిందన్నారు. హాలీవుడ్‌లో పుట్టి ఇండియాకి వచ్చిందని చెప్పారు దర్శకుడు గీతా కృష్ణ. ఇండియాలో మొదట కోలీవుడ్ లో పుట్టిందని, వాళ్లు నాస్టీ ఫెలోస్ అని, కన్నడ వాళ్ళు ఇంకా డర్టీ ఫెలోస్ అని చెప్పారు. ఈ సందర్భంగా వికీ లీక్స్ లో ఓ ప్రముఖ సింగర్‌ బయటపెట్టిన పేర్లని గుర్తు చేశారు గీతా కృష్ణ. 

47

ఒక అమ్మాయిని చూశారంటే  90 శాతం మగవాళ్ళు పడుకోవాలనే అనుకుంటారు. ఆడది కూడా హానీ ట్రాప్ అని, వాళ్లు సామాన్యులు కాదని, డబ్బుల కోసం లొంగదీసుకుని పిండేస్తుంటారని తెలిపారు. వాళ్ళు కాస్టింగ్ కౌచ్ చేస్తే.. వీళ్ళు హానీ ట్రాప్ చేస్తారు. ఈ రెండూ ఎప్పుడూ ఉంటాయని చెప్పారు  గీతా కృష్ణ . డైరెక్టర్స్ లోనే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది మ్యూజిక్ డైరెక్టర్స్ లో కూడా ఉంది. అందమైన సింగర్స్ తమతో పడుకోవాలని సంగీత దర్శకులు కోరుకుంటారన్నారు. అలాంటివి ధైర్యంగా బయటపడితే ఆ అమ్మాయి పరువే పోతుంది. తర్వాత ఎవరూ ఆఫర్స్ ఇవ్వరు. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే అని చెప్పారు. 
 

57

అయితే తాను అందరిని అనడం లేదని, ఇలాంటి వద్దు అనుకునే హీరోయిన్లు కూడా ఉంటారని, కానీ వాళ్లుకు అవకాశాలు తక్కువగా వస్తుంటాయని చెప్పారు. రేణూ దేశాయ్ చాలా పర్ఫెక్ట్ గర్ల్ అని పేర్కొన్నారు. `ప్రభుదేవా హీరోగా చేసిన 'టైమ్' సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ చేసినప్పుడు దానికి 20 మంది అమ్మాయిలను ఫోటోలు తీసాం. అయితే నేను రేణూ దేశాయ్ ఫోటోని ఎంపిక చేసాను. 'ఆ అమ్మాయి ఎందుకు? మీరు చెప్పిన మాట వినదు' అని కోఆర్డినేటర్స్ చెప్పారు. అలా ఎందుకు అన్నారో నాకు అసలు అర్థం కాలేదు''

67

1'ఫోటో వెనకున్న నంబర్ తో రేణూ దేశాయ్ కి ఫోన్ చేస్తే హోటల్ కు వచ్చి కలిసింది. `ఏంటి ఇక్కడ నీ గురించి ఇలా అంటున్నారు.. నీకేమైనా యటిట్యూడా?` అని అడిగాను. 'అదేం లేదండీ.. ఇక్కడ వీరంతా ఇలానే ఉంటారు. డర్టీ ఫెలోస్. నేను కమిట్మెంట్స్ కు దూరంగా ఉంటాను కాబట్టి.. నన్ను సపోర్ట్ చేయరు' అని చెప్పింది. వెంటనే నువ్వే నా సినిమాలో హీరోయిన్ అన్నాను. చివరకు సిమ్రాన్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా ఆ రోజు రేణూ దేశాయ్ చెప్తే కానీ నాకు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియలేదని చెప్పారు గీతా కృష్ణ.

77

దర్శకుడు గీతా కృష్ణ నాగార్జున, రమ్యకృష్ణలతో `సంకీర్తన` చిత్రాన్ని రూపొందించి నంది అవార్డు అందుకున్నారు. మ్యూజికల్‌గా ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత `కీచురాళ్లు`, `కోకిల`, `సర్వర్‌ సుందరంగారీ అబ్బాయి`, `ప్రియతమా` వంటి చిత్రాలు రూపొందించారు. రెండు తమిళ సినిమాలు చేశారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా 2013లో చేసిన తమిళ మూవీ `నిమిదంగల్‌` పరాజయం చెందింది. అంతకు ముందు చేసిన సినిమాలు కూడా పరాజయం చెందడంతో దర్శకుడిగా సైడ్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన తెరపైకి రావడం, ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసమే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories