Sai Pallavi Bonam: బోనమెత్తిన సాయిప‌ల్ల‌వి, వైరల్ అవుతున్న ఆ డైరెక్ట‌ర్ స్పెష‌ల్ ట్వీట్

Published : Jul 24, 2022, 02:52 PM ISTUpdated : Jul 24, 2022, 02:59 PM IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీరూపం బోనాలు పండుగ. ఒకప్పుటిలా కాకుండా ప్రస్తుతం  ఈపండుగను ఘనంగా.. రాష్ట్రపండుగగా జరుపుకుంటున్నాం. సామాన్యులతో పాటుసెలబ్రిటీలు కూడా బోనాలు ఎత్తి సందడి చేస్తున్నారు. ఇక తాజాగాసాయి పల్లవి బోనం ఎత్తిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

PREV
16
Sai Pallavi Bonam: బోనమెత్తిన సాయిప‌ల్ల‌వి, వైరల్ అవుతున్న ఆ  డైరెక్ట‌ర్ స్పెష‌ల్ ట్వీట్

నేచురల్ యాక్ట్రస్ సాయి పల్లవి బోనం ఎత్తింది. అచ్చతెలుగు తెలంగాణ ఆడపడుచు లా తయారయిన మలయాళ బ్యూటీ.. బోనమెత్తి సందడి చేసింది. అయితే సాయి పల్లవి ప్రస్తుతం జరుగుతున్న పండుగ సందర్భంగా బోనం ఎత్తలేదు. సినిమాలో బోనం ఎత్తింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

26

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల‌కు ప్ర‌తీకగా ప్రతీ ఏడాది జరుగుతుంటాయి బోనాలు. ఆడ‌ప‌డుచులు అందంగా ముస్తాబై.. బోనం తో ఊరేగింపుగా బ‌య‌లు దేరి అమ్మవారికి స‌మ‌ర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు.  అయితే ఈ  సంస్కృతిని, బోనాల ఉత్సవాల ఫ్లేవ‌ర్‌ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు ద‌ర్శ‌కులు. అలాంటి ప్లేవర్ తో వచ్చిన సినిమానే విరాటపర్వం. ఈమూవీలో సాయి పల్లవి బోనం ఎత్తి సందడి చేసింది. 
 

36

ఇప్ప‌టికే చాలా సినిమాల్లో చూపించిన బోనాల‌కు సంబంధించిన సీన్స్, సాంగ్స్ సినిమాలకే హైలెట్ అయ్యాయి. వాటిల్లో ఒక‌టిగా నిలిచింది రీసెంట్‌గా రానా, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ విరాట‌పర్వం . ఇక ఈ మూీ డైరెక్టర్  డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల  బోనాల పండుగను, తెలంగాణ  సంసృతిని  కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. అందులో బాగంగానే సాయిప‌ల్ల‌వి  లంగావోణిలో అచ్చతెలుగుదనం ఉట్టిప‌డేలా బోనం ఎత్తుకొని వ‌చ్చే సీన్స్ వీరాటపర్వానికి హైలెట్ అయ్యాయి. 
 

46

ఇక ఈరోజు ( 24 జులై)  బోనాల పండుగ సందర్భంగా విరాట‌ప‌ర్వం సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేస్తూ..అంద‌రికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు వేణు ఊడుగుల‌. ఇక ఆయన పెట్టిన హ్యాపీ బోనం అనే హ్యాష్‌ట్యాగ్‌ వైరల్ అవుతోంది. 
 

56

ఏదైనా డిఫరెంట్ గా చేయడం సాయి పల్లవికి ఇష్టం. హీరోయిన్ రోల్స్ కు వెయిట్ ఉండాలి, ఏదో బొమ్మలాగా నాలుగు డాన్స్ లు. ఓ పది ముద్దు సీన్లు చేసి డబ్బులు తీసుకోవడం కాదు అనే సూత్రాన్ని నమ్ముతుందిసాయి పల్లవి. తను ఎంచుకునే సినిమాలు కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచుగా వరుస సినిమాలు చేసింది సాయి పల్లవి. 

66

ఫిదా సినిమాతొ మొలు పెట్టి, లవ్ స్టోరీ, వీరాటపర్వం లాంటి సినిమాలో తెలంగానా అమ్మాయిగా ఇక్కడ యాస భాష పక్కాగా పలుకుతూ.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక ఇప్పుడు బోనం ఎత్తిన సాయి పల్లవి ఫోటోలుచూసిన ఆమె అభిమానులు, ఆడియన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories