డబ్బులిచ్చి నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యా.. సమంత వివాదాస్పద వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం

Published : Jul 24, 2022, 02:51 PM ISTUpdated : Jul 24, 2022, 04:12 PM IST

సమంత ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారుతున్న హీరోయిన్‌. ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నటి కూడా. ఈ క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అనే దానిపై స్పందిస్తూ షాకిచ్చారు.   

PREV
15
డబ్బులిచ్చి నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యా.. సమంత వివాదాస్పద వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం

సమంత(Samantha) టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. తెలుగు, తమిళంలో ఆమెకి తిరుగేలేదు. ఇప్పుడు హిందీలో మార్కెట్‌ పెంచుకుంటుంది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`, `పుష్ప`లో ఐటెమ్ సాంగ్‌తో నార్త్ లో విపరీతమైన క్రేజ్‌ని ఏర్పర్చుకుంది సమంత. మరోవైపు ఇటీవల పాపులర్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`(Koffee with Karan)లో పాల్గొని మరింత క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంది. 

25

దీంతోపాటు తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులపై స్పందించిన తీరు సైతం దుమారం రేపుతున్నాయి. చైతూ విషయంలో సమంత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదే `కాఫీ విత్‌ కరణ్‌` షోలో మరో సెన్సేషనల్‌ కామెంట్‌ చేసింది సమంత. ఇటీవల సమంత `ఓర్‌ మాక్స్` (Ormax)అనే రేటింగ్‌ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్‌లో సమంత ఇండియాలోనే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలిచింది.

35

తరచూ వార్తల్లో నిలవడం, ఇండియా వైడ్‌గా క్రేజ్‌, పాపులారిటీ, సినిమాలు, ఫాలోయింగ్‌ ఇలా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చే ఈ రేటింగ్‌లో సమంత నెంబర్‌ వన్‌ గా నిలవడం విశేషం. అయితే దీనిపై కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. `ఓర్‌మాక్స్ సంస్థ సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ పెద్ద బాంబ్‌ పేల్చింది సమంత. 

45

సమంత చెబుతూ, నిజం చెప్పనా అంటూ తాను ఆ సంస్థకి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానని తెలిపింది. దీంతో కరణ్‌తోపాటు అక్షయ్‌ కూడా నవ్వులు పూయించారు. అయితే సమంత ఈ సందర్భంగా సరదాగా కామెంట్‌ చేసినా ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివాదంగా మారాయి. సమంత అంత సెటైరికల్‌గా సమాధానం చెప్పడం పట్ల కొంత మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని ట్రోల్స్, మీమ్స్ తో వైరల్‌ చేస్తున్నారు. 

55

ఇదిలా ఉంటే సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. `శాకుంతలం`, `యశోద`, `ఖుషి`తోపాటు తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్‌ మూవీ చేస్తుంది. అలాగే హిందీలోకి ఎంట్రి ఇస్తూ ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ చిత్రానికి కమిట్‌ అయ్యిందట. దీంతోపాటు అక్షయ్‌ కుమార్‌తోనే మరో సినిమాకి కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. ఇది మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది. దీంతోపాటు ఓ అంతర్జాతీయ మూవీలో నటిస్తుంది సమంత. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories