తన జీవితంలో విడాకులపై కమల్ హాసన్ కామెంట్స్.. బాబోయ్, ఇలాంటి సమాధానం అసలు ఊహించలేం

First Published | Sep 21, 2024, 4:02 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ విలక్షణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు,సాహసాలు ఇంకెవరూ చేయలేరేమో. ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కమల్ హాసన్ నటనలో కొత్త దనం కోసం పరితపిస్తూనే ఉంటారు.

లోక నాయకుడు కమల్ హాసన్ విలక్షణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు,సాహసాలు ఇంకెవరూ చేయలేరేమో. ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కమల్ హాసన్ నటనలో కొత్త దనం కోసం పరితపిస్తూనే ఉంటారు. అయితే సినిమాలు పక్కన పడితే ఇతర విషయాల్లో కమల్ హాసన్ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. 

తన వ్యక్తిగత జీవితంలో కూడా కలం హాసన్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కమల్ హాసన్ కి ఇప్పటి వరకు రెండు సార్లు విడాకులు జరిగాయి. కమల్ హాసన్ 1978లో వాణి గణపతి అనే నటిని వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కమల్ 1988లో సారికని వివాహం చేసుకున్నారు. ఆమెతో 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. 


సారిక, కమల్ హాసన్ లకి శృతి హాసన్, అక్షర హాసన్ కుమార్తెలు. ఇక ప్రముఖ నటి గౌతమితో కమల్ హాసన్ కొన్నేళ్లు సహజీవనం చేశారు. వీళ్లిద్దరి మధ్య కూడా బ్రేకప్ జరిగింది. ఇలా తన జీవితంలో విడాకులు, బ్రేకప్స్ ఉండడంతో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇలా భార్యలతో విడిపోవడం వల్ల మీరు ఏమైనా తప్పు చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉందా అని యాంకర్ ప్రశ్నించారు. 

దీనికి కమల్ హాసన్ సమాధానం ఇస్తూ.. ఒకప్పుడు నాకు దైవ విశ్వాసం ఉండేది. టెంపుల్స్ లో నేను చూసిన చాలా మంది దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి,శివుడు , శ్రీకృష్ణుడు ఇలా కమల్ హాసన్ కొన్ని ఉదాహరణలు చెప్పారు. నా విడాకుల విషయంలో నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళ తరహాలో నాకు ఒకేసారి ఇద్దరు భార్యలు ఎప్పుడూ లేరు. విడిపోయిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నా అంటూ కమల్ హాసన్ ఊహించని సమాధానం ఇచ్చారు. 

ఇక నా పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా నేను కలగజేసుకోను. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే అదే నాకు సంతోషం. వాళ్ళకి నా రిక్వస్ట్ ఏంటంటే.. మా కులం కాకుండా ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిది అని కమల్ హాసన్ అన్నారు. 

Latest Videos

click me!