దానికి కారణం.. తన అభిమానులు తనను హీరోగా.. అందాల నటుడిగా మాత్రమే చేశారని.. ఆతరువాత ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు తాను చేయనని.. సోగ్గాడిగా ఇలాంటి పాత్రలు చేసి.. తన అభిమానులను నిరాశ పరచలేదనని ఆయన అనేవారట.
అతడు సినిమాలో మహేష్ బాబు తాతగా శోభన్ బాబు ను తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారట. కాని ఆయన ఆ పాత్ర చేయలేదని అంటుంటారు. ఇలా చాలా పాత్రలకోసం శోభన్ బాబు ఇంటికి వెళ్ళిన వారికి నిరాశే ఎదురయ్యింది. అంతే కాదు.. మీడియా కాని.. ఇంటర్వ్యూలు కాని తన ఇంటిదాకా వచ్చేవి కాదు.