సీనియర్ నటి సదా (Sada) కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. యంగ్ హీరో నితిన్ సరసన ‘జయం’ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలిసినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అందంతోనూ ఆకట్టుకుంది.
ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేసింది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో వెలుగొందింది. కానీ నాలుగైదేళ్లుగా ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ గ్రాండ్ గా రీఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది.
ఈ క్రమంలో సదా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన విషయాలను అభిమానులకు తెలియజేస్తూ ఆమె క్రేజ్ ను అలాగే కాపాడుకుంటోంది. మరోవైపు దర్శకనిర్మాతలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే బుల్లితెరపైన వరుస షోలతో అలరించింది. ‘ఢీ’, ‘బీబీ జోడీ’ తదితర షోలతో వినోదం పంచింది. ఈ సమయంలో ప్రతి ఎపిసోడ్ కోసం అదిరిపోయేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ వచ్చింది. నయా లుక్స్ తో మైమరిపించింది. తాజాగా కూడా కిర్రాక్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది.
లేటెస్ట్ గా సదా చీతా వేర్ లో దర్శనమిచ్చింది. మినీ వేర్ లో యంగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మత్తెక్కించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. కొంటె చూపులు, కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా అందాల ప్రదర్శన చేసింది. నయా లుక్ తో చూపు తిప్పుకోకుండా చేసింది.
ఇలా సదా తరుచుగా ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తూనే వస్తోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక సదా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘అహింస’ చిత్రంలో మెరిసింది. అంతకు ముందు ‘హాలో వరల్డ్’ సిరీస్ లో లీడ్ గా అలరించింది.