సాహో మూవీ రివ్యూ

First Published Aug 30, 2019, 5:44 AM IST

ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,  `సాహో`  దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగు వారి అభిరుచులు, మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరపడే కథ,కథనం,బడ్జెట్ తో  `సాహో`  రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని , ఒత్తిడిని మోయడానికి సిద్దపడ్డాడు. ట్రైలర్,పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన `సాహో` ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా,బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ ఏం మ్యాజిక్ తెరపై చేసారు, జనం మళ్లీ జేజేలు పలికి బాహుబలి స్దాయి హిట్ ఈ సినిమాకు ఇస్తారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

కథేంటి: ముంబైలో 2000 కోట్ల దొంగతనం చాలా తెలివిగా జరుగుతుంది. ఎలా చేసారో అర్దమవుతుంది..ఎవరు చేసారో అర్దం కాదు. ఒక్క క్లూ కూడా ఆ దొంగ వదలడు. ఆ కేసుని పోలీస్ అధికారి (మురళి శర్మ)కానిస్టేబుల్ (వెన్నెల కిషోర్) డీల్ చేస్తూంటారు. అయితే కేసులో పెద్దగా పురోగతి లేకపోవటంతో అండర్ కవర్ పోలీస్ గా అశోక్ చక్రవర్తి(ప్రభాస్)ని అపాయింట్ చేస్తారు. అశోక్ తన తెలివితో ఈ కేసుని ఈ కేసుని ఇన్విస్టిగేట్ చేసి ఒక్కో క్లూ పట్టుకుంటూ దొంగ (నీల్ నితిన్ ముఖేష్)ని ట్రేస్ చేస్తాడు.
undefined
అయితే ఆ దొంగకు డిపార్టమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూండటంతో తప్పించుకుంటూంటాడు. దానికి తోడు అతను దొంగే అని ప్రూవ్ చేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా దొంగతనం చేసేటప్పుడు పట్టుకోవాలి. అప్పుడు అశోక్ మరో స్కెచ్ వేస్తాడు. ఆ దొంగకు ఎరవేసి అతని దారిలోనే వెళ్లి పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో ఆ దొంగ వెళ్లే పబ్ కు వెళ్లి అక్కడ పరిచయం చేసుకుంటాడు. ఇక అశోక్ కు డిపార్టమెంట్ తరపున సాయిం చేయటానికి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతానాయర్ (శ్రద్దా కపూర్) డ్యూటీ వేస్తాడు. మెల్లిగా అశోక్ ఆమెతో ప్రేమలో పడతూంటాడు.
undefined
మరో ప్రక్క ఆ దొంగ తాగిన మైకంలో ఓ విలువైన ఇన్ఫర్మేషన్ అశోక్ కు ఇచ్చేస్తాడు. అదేమిటంటే...వాజీ సిటిలో ఓ మిస్టీరియస్ బ్లాక్ బాక్స్ ఉందని, దాని కోసం చాలా మంది గ్యాంగస్టర్స్ వెతుకుతున్నారని,దాన్ని కనుక పట్టుకుంటే కోట్లు కలిసి వస్తుందని, తను కూడా దాని కోసం ట్రై చేద్దామనుకుంటున్నాడని చెప్తాడు. దాంతో అశోక్ ...ఆ బ్లాక్ బాక్స్ దొంగతనం సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిపార్టమెంట్ తో కలిసి ప్లాన్ చేస్తాడు.
undefined
ఇదిలా ఉంటే సిటీలో ఓ పెద్ద డాన్ రాయ్ (జాకీ షరాఫ్)ని కొందరు రైవల్ బ్యాచ్ యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. అతను కొడుకు (అరుణ్ విజయ్) తన తండ్రి ప్లేస్ లోకి వస్తాడు. అంతేకాక తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఈ రాయ్ గ్యాంగ్ కు అశోక్ లింక్ ఏంటి..ఆ బ్లాక్ బాక్స్ మిస్టరీ ఏమిటి..అసలు సాహో ఎవరు, దొంగను ..హీరో పట్టుకోగలిగాడా, సినిమాలో మెయిన్ విలన్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎనాలసిస్: 'బాహుబలి' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత ఓ నటుడుగా ప్రభాస్ పైనా, ఆయన్ని డీల్ చేసే దర్శకుడుపైనా ఏ స్దాయి ప్రెజర్ ఉంటుందో ఊహించవచ్చు. ఆ ప్రెజర్ తో రాకెట్ లా దూసుకుపోవటమో లేక, ఆ ప్రెజర్ తట్టుకోలేక పేలటమో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎప్పుడూ జరుగుతూంటుంది. అయితే అది ఏది అనేది ఎప్పుడూ క్వచ్చిన్ మార్కే. ఆ విషయం ప్రభాస్ కు తెలియంది కాదు. అందుకే తెలివిగా బాహుబలికి క్వయిట్ ఆపోజిట్ గా మోడ్రన్ యాక్షన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు ఏ స్టార్ డైరక్టర్ ని ఎంచుకున్నా...అంచనాలు మరింత పెరుగుతాయి.
undefined
అందుకే సుజీత్ ని సీన్ లోకి తెచ్చి అంచనాలు అదుపులో పెట్టే ప్రయత్నం చేసారు. కానీ సాహో ఎప్పుడైతే తెలుగు సినిమా రేంజ్ దాటిపోయి ఇండియన్ సినిమా అయ్యిపోయిందో అప్పుడే అంచనాలు దాటి పోయింది. ఖచ్చితంగా దేశం మొత్తానికి నచ్చే సినిమా చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాని ఇంపాక్ట్ పాజిటివ్ గానూ,నెగిటివ్ గానూ ప్రాజెక్టు పై పడింది. తెలుగుదనం అనేది తగ్గిపోయి, హిందీతనం పెరిగిపోయింది. దానికి యూనవర్సిల్ అప్పీల్ అని పేరు పెట్టుకుని సంతోష పడాల్సిందే.
undefined
ట్విస్ట్ లకే ప్రయారిటి : ఈ సినిమాలో ట్విస్ట్ లుకు,స్టైల్ కు ఇచ్చిన ప్రయారిటి ఎమోషన్స్ కు ఇవ్వలేదు. దాంతో తెరపై ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా కనెక్ట్ కావటం కష్టమైపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తం డల్ గా నడిపారు. ఏంటిరా బాబు ఇది ప్రభాస్ సినిమాయేనే అనిపించేలా ఫస్టాఫ్ నడుస్తుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ మాత్రం బాగా పేలింది.
undefined
ఇక సెకండాఫ్ అయినా కనెక్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ వరసపెట్టి ట్విస్ట్ లు పేర్చాడు. మైండ్ గేమ్ లతో గెలిచే హీరో కథ చెప్దామనుకున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా..మరీ మైండ్ గేమ్ లు ఎక్కువై ట్విస్ట్ లు కుప్పలు తెప్పలై వాటిని మైండ్ డైజస్ట్ చేసుకోవటం కష్టం అయ్యింది. క్లైమాక్స్ లో ప్లాష్ బ్యాక్ చూస్తే రొటీన్ రివేంజ్ స్టోరీ చూసామా అనిపించింది.
undefined
ట్రావెల్ అవటం కష్టం: ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తేవచ్చేమో కానీ, ఆ స్దాయి లో వాటిని సమకూర్చటం మాత్రం మాటలు కాదు. అందుకు టీమ్ ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఆ యాక్షన్ సీన్స్ కు తగ్గ నేపధ్యం, ఎమోషన్ ఏర్పాటు చేయటంలో మాత్రం డైరక్టర్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. తెరపై యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ చేసే విన్యాసాలు అదిరిపోయినా థియోటర్ లో పెద్దగా రెస్పాన్స్ రాకపోవటానికి కారణం అదే. ఏ ఫైట్ ఎందుకు, ఎవరితో చేస్తున్నాడనేది ఎప్పుడూ క్లారిటీ అనిపించదు. థ్రిల్లింగ్ ,ట్విస్ట్ కోసం ప్రతీ విషయం దాచి పెట్టడంతో హీరో తో ట్రావెల్ అవటం కష్టం.
undefined
క్లైమాక్స్ : ఇంత భారీ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్రెడిక్టుబుల్ ట్విస్ట్ తో ఇచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పేలిస్తే ఇది తేలిపోయింది.
undefined
ఫన్,రొమాన్స్: ఈ సినిమాలో మనం రెగ్యులర్ తెలుగు సినిమాలు నుంచి ఆశించే ఫన్, రొమాన్స్ కు పెద్దగా అవకాసం లేదనే చెప్పాలి. వెన్నెల కిషోర్ ఉన్నా పెద్దగా ఫన్ యాంగిల్ లో వర్కవుట్ చేయలేదు. నిజానికి రన్ రాజా రన్ దర్శకుడు నుంచి ఆ ఫన్ ని, కామెడీ టింజ్ ని ఆశిస్తాం. కానీ అవే మిస్సయ్యా
undefined
ప్రభాస్, శ్రద్దా కపూర్ కెమిస్ట్రీ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, తను నటుడుగా ఎప్పుడూ నిరాశపరచలేదు. మరీ ముఖ్యంగా బాహుబలి నుంచి ఆయన డిక్షన్, నటన మొత్తం మారిపోయాయి. నటనలో ఓ థీమా, ఓ ఫైర్ కనపడుతుంది. యాక్షన్ సినిమాలకు ఫెరఫెక్ట్ గా కావాల్సింది అదే కాబట్టి కరెక్ట్ గా సింక్ అయ్యింది. ఇక శ్రద్దా కపూర్ గురించి చెప్పాలంటే..ఆమె అందం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.
undefined
సాహో సాంగ్స్ ఈ సినిమా ఆడియో పరంగా పెద్దగా కిక్ ఇవ్వలేదు. తెరపై మాత్రం పాటల పిక్చరైజేషన్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా బ్యాడ్ బోయ్ సాంగ్ కు అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
undefined
హైలెట్స్: సినిమాలో ప్రభాస్ స్టైల్, ఫైట్స్ - ఇంటర్వెల్ ట్విస్ట్ - బ్యాడ్ బోయ్ సాంగ్ లో జాక్విలిన్ - జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
undefined
మైనస్ లు: ఎక్కువైపోయిన ట్విస్ట్ లు - హీరోకు ఎమోషన్ డెప్త్ ఇవ్వకపోవటం - ఆర్డనరీ ఫస్టాఫ్ - ప్లాట్ గా ఉన్న క్లైమాక్స్
undefined
టెక్నికల్ గా: ఈ సినిమాకు టెక్నికల్ గా అవుట్ స్టాండింగ్ గా ఉందని చెప్పాలి. అన్ని విభాగాలు మంచి అవుట్ పుట్ ఇచ్చాయి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దారి తప్పినా సుజీత్ మేకింగ్ విషయంలో తన టాలెంట్ చూపాడు. పెద్ద హీరోలను డీల్ సమర్దంగా డీల్ చేయగలనిపించుకున్నాడు.
undefined
ఫైనల్ థాట్: ఫ్యాన్స్...డైహార్ట్ ఫ్యాన్స్ కే..
undefined
సాహో మూవీ ఫైనల్ రేటింగ్:2.755
undefined
click me!