భారత సినీ సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో తరతరాల ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణంలో వేలాది పాటలు పాడి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా అనేక భాషల్లో తన ముద్ర వేసుకున్నారు. `నైటెంగేల్ ఆఫ్ సౌత్ ఇండియా`గా, వాయిస్ మాడ్యూలేషన్‌లో క్వీన్‌గా రాణించారు. ఆమె తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో దాదాపు 17 భాషల్లో 50వేలకుపైగా పాటలను ఆలపించారు. ఆమె స్వరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోసింది. అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ఎస్. జానకి, సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం సంపాదించారు. ఇంత గొప్ప కెరీర్‌ను నిర్మించుకున్న ఆమె ఆస్తుల విలువ, నెట్‌వర్త్ గురించి అభిమానుల్లో తరచూ ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.