`ధురంధర్`, `ధురంధర్ 2` సినిమాలతో ఆదిత్య ధర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో తెలిసిందే. రెండో భాగంగా ఏకంగా రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాలతో సరికొత్త చరిత్ర సృష్టించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రభాస్‌తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే ముందు రణ్‌వీర్ సింగ్‌తోనే సినిమా ఉంటుందని భావించారు, కానీ ఇటీవలే హైదరాబాద్‌లో ఆదిత్య ధర్, ప్రభాస్‌ను కలిశారని వార్తలొస్తున్నాయి. ఆయన ప్రభాస్‌కు తన కొత్త సినిమా కథను వినిపించారట. కథాంశం ప్రభాస్‌కు బాగా నచ్చిందని, ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. అయితే, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.