RX100 హీరో కార్తీకేయ పెళ్లి రోజు.. మనోడి కోసం ఆమె పదేళ్లు వెయిట్ చేసింది.. వీరి లవ్ స్టోరీ తెలుసా?

First Published | Nov 25, 2023, 4:32 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ ప్రస్తుతం భార్యతో వెకేషన్ లో ఉన్నారు. ఇవాళ వారి పెళ్లిరోజు కావడం విశేషం. ఇంతకీ వారి లవ్ స్టోరీ ఎలా స్టార్ అయ్యిందో తెలుసుకుందాం. 

హైదరాబాద్ కుర్రాడు, టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda)  ప్రస్తుతం హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నటుడిగా మారిపోయారు. RX100 తర్వాత నటుడిగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. 

అయితే, ఈరోజు కార్తీకేయ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే సరిగ్గా రెండేళ్ల కింద ఇదేరోజున ఆయన తన ప్రియురాలితో పెళ్లిపీటలు ఎక్కాడు. ఎంతో గ్రాండ్ గా కార్తీకేయ పెళ్లి లోహిత రెడ్డి (Lohitha Reddy)తో జరిగింది. 


2021 నంబర్ 25న వీరి పెళ్లి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు కూడా  హాజరై ఆశీర్వదించారు. నేటితో వీరి వివాహ బంధానికి రెండేళ్లు పూర్తైంది. దీంతో అభిమానులు, నెటిజన్లకు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఈ సందర్భంగా కార్తీకేయ తన భార్యతో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పంచుకుంటూ ఆమెను విష్ చేశారు. ‘2 సంవత్సరాల ప్రేమ, స్నేహం, తగాదాలు, నవ్వులు మరియు అక్షరాలా మనం అనుభవించిన ప్రతి ఇతర భావోద్వేగాలకు శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ లో పేర్కొన్నారు. అటు లోహిత కూడా సేమ్ క్యాప్షన్ తో కార్తీకేయకు శుభాకాంక్షలు తెలిపింది. 

వీరి పెళ్లి రోజు సందర్భంగా కార్తీకేయ - లోహిత రెడ్డి లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. వెండితెరపై కార్తీకేయ ఎలా అదరగొడుతారో చదువులోనూ ముందుడేవాడు. NIT Warangal లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అదే కాలేజీలో లోహిత రెడ్డి కూడా చదివింది. 

వీరి ప్రేమ చిగురించింది ఈ కాలేజీలోనే. 2010లో వీరద్దరూ మనసులు కలిశాయి. దాంతో పదేళ్లుగా ప్రేమలో మునిగి తేలారు. 2021లో కార్తీకేయ హీరోగా ఫ్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల పాటు వీరి లవ్ ట్రాక్ సాగింది. లోహిత కూడా కార్తీకేయ కోసం పదేళ్లు వెయిట్ చేయడం గొప్పవిషయమంటున్నారు. ట్రూ లవ్ అని పొగుడుతున్నారు. ఈ సందర్భంగా వారి రేర్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటంతో చూసి సంతోషిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కార్తీకేయ రీసెంట్ గా ‘బెదురులంక2012’తో హిట్ అందుకున్నారు. నెక్ట్స్ మూవీపై అప్డేట్ రావాల్సి ఉంది. 

Latest Videos

click me!