నాగచైతన్య - శోభితా దూళిపాళ బ్రేకప్? అంతలోనే ఏమై ఉంటుంది!

First Published | Jul 5, 2023, 1:22 PM IST

అక్కినేని నాగచైతన్య - శోభితా దూళిపాళ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని తెగ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఇక తాజాగా మాత్రం వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని అంటున్నారు. 
 

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలో బ్యాక్ టుబ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చైతన్య సినిమాల కంటే తన పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. 
 

అయితే, నాగచైతన్య రెండేళ్ల కింద స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి డివోర్స్ మేటర్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులకు  ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 
 


ఆ తర్వాత నుంచి చైతూ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. గతంలో కంటే ప్రస్తుతం భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే డివోర్స్  తర్వాత చైతూ నటి శోభితా దూళిపాళ (Sobhita Dhulipala)తో మళ్లీ ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 
 

ఇందుకు కారణం కూడా వీరిద్దరూ జంటగా కలిసి కెమెరా కంట పడటం.. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ గా మారడమే. హైదరాబాద్ లోని ఎఫ్1 రేస్, లండన్ లోని హోటల్ లో డిన్నర్ చేస్తూ జంటగా కనిపించారు. దీంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ కొనసాగుతోందని ప్రచారం జరిగింది. 
 

ఇక శోభితా కూడా హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా చైతూను కలిసి వెళ్తుందని, ఇప్పటికే నాగార్జున, అమలను కూడా శోభితా కలిసిందని అప్పట్లో రూమర్లైతే వచ్చాయి. ఈ క్రమంలో త్వరలో వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో షాకింగ్ రూమర్ ఒకటి వినిపిస్తోంది.
 

కొద్దినెలలుగా కలిసి తిరిగిన నాగచైన్య - శోభితా దూళిపాళ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే చైతూ బ్రేకప్ చెప్పారని కొత్త మళ్లీ రూమర్లు పుట్టుకొచ్చాయి. అసలు ఇంతకూ వారి రిలేషన్ షిప్ ను అధికారికంగా ప్రకటించనే లేదు. అంతలోనే బ్రేకప్ దాకా వెళ్లిందా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారి ప్రకటన లేదు. 

Latest Videos

click me!