అబ్భా ఏం అందంరా బాబు... పుట్టు మచ్చలు కూడా కనిపించేలా రాశి అల్ట్రా స్టైలిష్ లుక్!

First Published Oct 14, 2022, 12:01 PM IST

పొడుగు భామ రాశి ఖన్నా హాట్ ట్రెండీ వేర్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ ట్రై చేసింది. పర్పుల్ కలర్ టాప్ రాశి గ్లామర్ ని రెట్టింపు చేయగా... చూసిన ఫ్యాన్స్ ఏం అందంరా బాబు అంటూ టెంప్ట్ అయిపోతున్నారు.
 

Raashi Khanna

ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు కూడా కనిపించేలా రాశి ఖన్నా హెచ్ డి ఫోటోలు మంటరేపుతున్నాయి. రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు. 
 

Raashi Khanna


రాశి ఖన్నా వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డారు. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. కనీస వసూళ్లు రాబట్టలేక డిజాస్టర్ అయ్యాయి. ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో హిట్ పడలేదు. 
 

Raashi Khanna

ఆ మధ్య వరుసగా తమిళంలో రాశి చిత్రాలు చేశారు. కాగా కార్తీకి జంటగా నటించిన సర్దార్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 21న సర్దార్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ విజయంపై రాశి విశ్వాసంతో ఉన్నారు. 
 

Raashi Khanna


అలాగే రాశి చేతిలో ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా యోధ చిత్రం చిత్రం చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా యోధ తెరకెక్కుతుంది. ఈ మూవీ విజయం సాధిస్తే... రాశి ఖన్నాకు బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. 
 

Raashi Khanna

తెలుగులో రాశి ఊపు తగ్గినట్లే కనిపిస్తుంది. దీంతో ఆమె ఇతర పరిశ్రమలపై ఫోకస్ పెట్టారు. ఆమెకు స్టార్స్ పక్కన ఆఫర్స్ రావడం లేదు. కెరీర్ లో రాశి నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. జై లవకుశ మూవీలో అతనితో జతకట్టింది. 
 

Raashi Khanna


మనం రాశి ఖన్నా నటించిన మొదటి తెలుగు చిత్రం. ఆ చిత్రంలో చిన్న క్యామియో రోల్ చేస్తారు. తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఆమెకు ఆఫర్ ఇచ్చారు. నాగ శౌర్యకు జంటగా ఊహలు గుసగుసలాడే మూవీలో రాశికి ఛాన్స్ దక్కింది. 

Raashi Khanna


అనంతరం జిల్, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. రాశి ఖన్నా కెరీర్లో బాగా లాభాలు తెచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. దాదాపు రూ. 35 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. 

click me!