అర్జెంటు పని ఉంది టీవీ ఆపు అని సుభాష్ చెప్తే ఇది నా ఫేవరెట్ ప్రోగ్రాం అన్నయ్య, కావాలంటే మీరే మీ రూమ్ లోకి వెళ్ళండి అంటుంది రుద్రాణి. చేసేదేమీ లేక వాళ్ల గది వైపు వెళ్తారు ముగ్గురు. మీ ఇద్దరూ ఒకే కానీ తను నా రూమ్ లోకి రావడానికి వీల్లేదు అని కోపంగా అంటుంది అపర్ణ. ఇది నీ గదేనా, నా గది కాదా, నాకు అర్జెంటు పని ఉంది అంటూ ఆమెని మందలించి బయటికి పంపిస్తాడు సుభాష్. అది చూసి నవ్వుకుంటుంది రుద్రాణి.