ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్‌ మధ్య `నాటు నాటు` చిచ్చు.. ఈ సారి ప్రూఫ్స్ చూపించి మరీ విమర్శలు..

Published : Apr 12, 2022, 05:28 PM ISTUpdated : Apr 12, 2022, 05:33 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విషయంలో రాజమౌళి చేసిన చేసిన దానికి ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి పడటం లేదు. దాన్ని మరింత రెట్టింపు చేసింది యూనిట్‌. `నాటు నాటు` సాంగ్‌తో మరో వివాదం తెరపైకి వచ్చింది.   

PREV
16
ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్‌  మధ్య `నాటు నాటు` చిచ్చు.. ఈ సారి ప్రూఫ్స్ చూపించి మరీ విమర్శలు..

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల నటనకు జనం ఫిదా అవుతున్నారు. సినిమాకి బ్రహ్మారథం పడుతున్నారు. దీంతో భారీ కలెక్షన్ల దిశగా సినిమా రన్‌ అవుతుంది. 

26

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్ర ప్రాధాన్యత విషయంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మా హీరో బాగా చేశాడంటే, మా హీరో బాగా చేశాడని కామెంట్లు చేసుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో పెద్ద వార్‌ జరిగింది. ఎన్టీఆర్‌ కంటే, రామ్‌చరణ్‌ పాత్రే హైలైట్‌ అయ్యిందని, తారక్‌ రోల్‌ తగ్గిందని అంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్‌ సైతం కాస్త అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. చరణ్‌కి వచ్చిన ఎలివేషన్‌ యంగ్‌ టైగర్‌కి రాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

36

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ మధ్య మరో చిచ్చు పెట్టింది `ఆర్‌ఆర్‌ఆర్‌` యూనిట్‌. `నాటు నాటు` పూర్తి పాటని సోమవారం సాయంత్రం విడుదల చేసింది. సాంగ్‌ రిలీజైనప్పటి నుంచి ఇద్దరు హీరోల మధ్య వివాదం మరింత పెద్దది చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయేలా డాన్స్ చేశారు. ఈ పాట, వారి డాన్సులు ఫ్యాన్స్‌ కే కాదు,జనరల్‌ ఆడియెన్స్ కి కూడా కనువిందుగా ఉంటుంది. పాట ఎంతో పాపులర్‌ అయ్యింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పోలికలే వివాదాన్ని రాజేస్తున్నాయి. 

46

 బ్రిటీష్‌ కోటలో `నాటు నాటు` సాంగ్‌ వస్తుంది. ఇందులో తారక్‌, చరణ్‌ మాస్‌ స్టెప్పులు దుమ్మురేపేలా ఉన్నాయి. సినిమాకే ఈ సాంగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇద్దరు హీరోలు పోటీపడీ స్టెప్పులేశారు. కళ్ల సంబురంగా మార్చారు. కానీ ఇద్దరు హీరోల మధ్య స్టెప్పుల్లోనూ లోపాలను వెతుకుతుండటంతో ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు రాజేసినట్టయ్యింది. పాటలోని స్క్రీన్‌ షాట్లని తీసి మరీ మా హీరో సూపర్‌గా చేశాడంటే, మా హీరో అద్భుతంగా చేశారని కామెంట్లు చేస్తున్నారు ఇద్దరు హీరోల అభిమానులు. 
 

56

ఎన్టీఆర్‌ కొన్ని స్టెప్పుల్లో తేలిపోయాడని, సరైన మూమ్‌మెంట్‌ ఇవ్వడం లేదని చరణ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. చరణ్‌ని డాన్సుల్లో ఇంకెవ్వరూ డామినేట్‌ చేయలేరని, ఆయనకు పోటీ లేదని చెబుతున్నారు. మరోవైపు తారక్‌ ఫ్యాన్స్ సైతం తమ హీరోతో పోల్చుతూ, సరైన్‌ మూవ్‌మెంట్స్ లేదని, చాలా చోట్లు స్టెప్పులు తప్పుగా పడ్డాయని అంటున్నారు. ఎన్టీఆర్‌ బెస్ట్ డాన్సర్‌ అంటున్నారు. కామెంట్ల వరకు ఓకే కానీ ఏకంగా పాటని స్క్రీన్ షాట్లు తీసి మరి ఇదిగో ప్రూఫ్స్ అంటూ నిలదీస్తుండటం ఇప్పుడు వివాదం మరింత పెచ్చినట్టయ్యింది. దీంతో ఇప్పుడు `నాటు నాటు` పాటకి సంబంధించిన స్క్రీన్ షాట్లతో సోషల్‌ మీడియా షేక్‌ అయిపోతుంది. 

66

వివిధ మూవ్‌మెంట్స్ ని క్యాప్చర్‌ చేసి మరీ తప్పులు వెతకడం మరింత వివాదంగా మారుతుంది. ఒకే మూవ్‌మెంట్స్ కి ఇద్దరు ఒకేసారి ఒకేలా స్టెప్పులు వేయడం చాలా కష్టంతో కూడిన విషయం. కానీ వంద శాతం ఎన్టీఆర్‌, చరణ్‌ న్యాయం చేశారు. ఏదో చిన్న చిన్న తేడాలను చూపించి తమ హీరో గొప్ప తమ హీరో గొప్ప అని కామెంట్లు చేసుకోవడం సరికాదనేది మరికొందరి ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈ వివాదానికి, ఈ పోలికలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories