RRR
ట్రిపుల్ ఆర్ సినిమాకు 2023లో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకు పాటల రచయిత చంద్రబోస్ రాసిన, ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ పాటను ఆస్కార్ అవార్డులు అందించే స్టేజిమీద లైవ్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో అనేక అవార్డులు కూడా వచ్చాయి.
RRR
అకాడమీ అవార్డులను అదే ఆస్కార్‌లను ఇప్పటివరకు మొత్తం 23 విభాగాలకు ఇస్తున్నారు. ఇందులో నటన, దర్శకత్వం నుంచి సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక అంశాలపై కూడా అవార్డులు ఇస్తున్నారు. అయితే తాజాగా మరో కేటగిరీని కూడా అందులో చేర్చారు. ప్రస్తుతం ప్రతి సినిమాలో స్టంట్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉంది. హీరోయిజం బయట పెట్టేది, ఆకర్షించేది స్టంట్సే. ఇటీవల విడుదలైన పుష్ఫ-2లో కూడా స్టంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి.
oscar RRR Stunts
ఇండియన్ సినిమా అయిన ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలుపొందటంతో ఆ సినిమాలోని ప్రతి అంశం ప్రత్యేకత ప్రపంచానికి తెలిసింది. ఇక ఆస్కార్ అకాడమీ వారు రీసెంట్‌గా వార్షిక అవార్డుగా స్టంట్ డిజైన్ క్యాటగిరీని ప్రకటించారు. అయితే.. ఇందులో హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్, టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ స్టంట్స్ పోస్టర్స్‌తోపాటు ట్రిపుల్ ఆర్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ఫొటోతో కలిపి ప్రకటించారు. దీన్ని చూసిన చరణ్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.
RRR Stunts oscar recogniged
ట్రిపుల్ ఆర్ సినిమాతో రాంచరణ్ విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా రెండో భాగంలో అల్లూరి సీతారామరాజు పోలిన క్యారెక్టర్‌లో రాం చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్‌చూసిన ఉత్తరాదిరాష్ట్రాల ప్రజలు చరణ్ రాముడి గెటప్‌లో అదరగొట్టారని ప్రశంసించారు. ఈ లుక్‌తో చేసిన స్టంట్స్ హాలీవుడ్‌ను కూడా ఆకట్టుకున్నాయంట. అందుకే తాజాగా ఆస్కార్ ప్రవేశపెట్టిన స్టంట్స్ కేటగిరీలో రాంచరణ్ ట్రిపుల్ ఆర్ స్టంట్స్ చిత్రాన్ని నమూనాగా తీసుకున్నారు. అంటే చరణ్ స్టంట్స్ గ్లోబల్‌లెవల్ ఎంత రచ్చచేశాయో కదా..
RRR Stunts
ఆస్కార్ స్టంట్స్ క్యాటగిరీని 2027 నుంచి తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో ట్రిపుల్‌ఆర్‌కి ఆ అవకాశం దక్కలేదు. కానీ ట్రిపుల్ ఆర్ సినిమాలో ఉన్నట్లు న్యాచురల్‌గా స్టంట్స్ ఉంటే మాత్రం అవార్డు ఇస్తామని పరోక్షంగా చరణ్ ఫొటోని వారు వినియోగించిన విధానంలో తెలుస్తోంది. మరి మన తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు రానున్న రోజుల్లో స్టంట్స్‌పై ఏ విధంగా దృష్టిసారిస్తారో చూడాలి.