RRR Collections: రూ.1000 కోట్ల వైపు ‘ఆర్ఆర్ఆర్’ పరుగులు.. రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో ప్రాఫిట్ జోన్ లోకి..

Published : Apr 06, 2022, 04:45 PM IST

దర్శకధీరుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. రూ.1000 కోట్ల రీచ్ కు  అతిసమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది.

PREV
17
RRR Collections: రూ.1000 కోట్ల వైపు ‘ఆర్ఆర్ఆర్’ పరుగులు..  రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో ప్రాఫిట్ జోన్ లోకి..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ RRR బాక్సాఫీస్ కలెక్షన్ మతిపోగొడుతున్నాయి. ఈ చిత్రం రిలీజ్ డే నుంచి ఇంకా కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. రెండు వారాలు పూర్తి చేసుకున్నా నేటికీ థియేటర్ల వద్ద ఈ మల్టీస్టారర్ చిత్రం హవా ఏమాత్రం తగ్గలేదు. 
 

27

భారీ హైప్ తో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ అందుకు తగట్టుగానే అంచనాలను నిలుపుకుంటోంది. గత నెల మార్చి 25న ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగే ఆర్ఆర్ఆర్ రూ.223తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హయేస్ట్ ఓపెనింగ్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.

37

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించడంతో థియేటర్లలో ఈ సినిమా సందడి ఇంకా నెలకొంది. దాదాపుగా నాలుగేండ్ల పాటు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. 
 

47

ఈ చిత్రం రిలీజ్ అయ్యి నేటితో 13 రోజులు గడిచింది. అయితే మొదటి వీకెండ్ పూర్తయ్యే వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.709.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రోజు వారి కలెక్షన్లు కూడా మతిపోయేలా ఉన్నాయి. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం నిన్నటి వరకే  రూ.900 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు చెబుతున్నాయి. 
 

57

ఒక రోజు వారిగా కలెక్షన్లు చూస్తే.. మొదటి రోజు రూ. 223 కోట్లు, రెండో రోజు రూ.133 కోట్లు, మూడో రోజు రూ.130 కోట్లు, నాలుగో రోజు రూ.70 కోట్లు, ఐదో రోజు రూ.60 కోట్లు, అరవ రోజు రూ. 45 కోట్లు, ఏడవ రోజు రూ.40 కోట్లు, ఎనిమిదో రోజు రరూ.41  కోట్లు, తొమ్మిదో రోజు రూ.69 కోట్లు, పదో రోజు రూ.80 కోట్లు, పదకొండవ రోజు రూ. 20 కోట్లు, పన్నెండవ రోజు రూ.18.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
 

67

ఈ నివేదిక ప్రకారం ఆర్ఆర్ఆర్ 12 రోజుల్లో మొత్తం రూ.940 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రూ.1000 కోట్లను చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్ పూర్తయ్యే వరకు RRR కచ్చితంగా రూ.1000 కోట్లు వసూల్ చేస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.  
 

77

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా  హైయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ జాబితాలో ఆర్ఆర్ఆర్ చేరిపోయింది. రూ.1000 కోట్ల రీచ్ తో థర్డ్ ప్లేస్ లోకి రానుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన ‘పీకే’ను బీట్ చేసిందీ సినిమా. మరికొద్ది రోజుల్లో బాహుబలి రికార్డులను కూడా తిరగరాస్తోందని ఆర్ఆర్ఆర్ టీం ఆశిస్తోంది. 

click me!

Recommended Stories