RRR Promotion Effect: అల్లు అర్జున్‌తోపాటు రామ్‌చరణ్‌ని కూడా పిండేయబోతున్న బాలీవుడ్‌..

First Published Jan 18, 2022, 10:06 AM IST

తెలుగు సినిమా లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు హిందీ  పరిశ్రమ తెలుగుపై ఆధారపడే స్థాయికి చేరుకోవడం విశేషం. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌ పుణ్యమా అని అల్లు అర్జున్‌, రామచరణ్‌ సినిమాలు నార్త్ లో సందడి చేయబోతున్నాయి. 
 

`బాహుబలి` సినిమా, `సాహో` చిత్రాలు నార్త్ లో తెలుగుకి మంచి మార్కెట్‌ ఏర్పాటు చేశాయి. దీనికితోడు `ఆర్‌ఆర్‌ఆర్‌`  సినిమా యూనిట్‌ ఆ మధ్య చేసిన ప్రమోషన్‌ కార్యక్రమాలు తెలుగు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. అంతేకాదు తెలుగు సినిమా మార్కెట్‌ని మరింతగా విస్తరింప చేశాయి. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌(నార్త్)లో తెలుగు సినిమాలకు బాగా గిరాకీ ఏర్పడింది. తెలుగు సినిమాల కోసం బాలీవుడ్‌ మేకర్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

`ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌ ప్రభావంతో అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఎలాంటి ప్రమోషన్‌ లేకుండానే ఈ చిత్రానికి ఏకంగా ఎనభై కోట్ల కలెక్షన్లు రావడం విశేషం. `పుష్ప` కలెక్షన్లు చూసి బాలీవుడ్‌ మేకర్సే ఆశ్చర్యపోతున్నారు. కరోనా ప్రభావంతో బాలీవుడ్‌ సినిమాలు రిలీజ్‌కి వెనకాడుతున్నాయి. దీంతో తెలుగు సినిమాలు హిందీలో దుమ్మురేపుతున్నాయి. అందుకు `పుష్ప`నే ఉదాహరణగా చెప్పొచ్చు. కరోనా తీవ్రత లేకుంటే ఇది మరిన్ని కలెక్షన్లు రాబట్టేదని ట్రేడ్‌ వర్గాల అంచనా. 

అల్లు అర్జున్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఆయన నటనపై,  `పుష్ప` సినిమాపై బాలీవుడ్‌ మేకర్స్, యాక్టర్స్ ప్రశంసలు కురిపించారు. దీంతో ఆ క్రేజ్‌ మరింతగా పెరిగింది. అయితే ఆ క్రేజ్‌ని  పాపులారిటీని వాడుకోవాలని, కావాల్సినంతగా పిండుకోవాలని(కలెక్షన్లు) బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌లు భావిస్తున్నాయి. అందులో భాగంగా బన్నీ నటించిన మరో బ్లాక్‌బస్టర్‌ `అల వైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలో డబ్‌ చేయబోతున్నాయి. అక్కడ గోల్డ్‌ మైన్‌ సంస్థ ఈ హిందీ డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకుంది. 

ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా `అల వైకుంఠపురములో` హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. సోమవారం నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని  వెల్లడించింది. బన్నీకి ఉన్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని, బాలీవుడ్‌ ఆడియెన్స్  నుంచి మరిన్ని  కలెక్షన్ల రాబట్టుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం హిందీలో రీమేక్‌ అవుతుంది. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా `షేహజాదా` పేరుతో రూపొందుతుంది. కార్తీక్‌ ఆర్యన్‌, కృతిసనన్‌  జంటగా నటిస్తున్నారు. రోహిత్‌ దావన్‌ దర్శత్వం వహిస్తున్నారు.  ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది.  

మరి ఓ వైపు రీమేక్‌ జరుగుతుండగా, యూట్యూబ్‌లో కాకుండా ఏకంగా థియేటర్లలోనే డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదల చేయడం  ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.  రీమేక్‌ చిత్రంపై ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉందని, కార్తిక్‌ ఆర్యన్‌కిది పెద్ద షాకే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న `అల వైకుంఠపురములో` చిత్రం 2020లో విడుదలై ఆకట్టుకుంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బన్నీకి ఇప్పుడు హిందీలో క్రేజ్‌ ఏర్పడిన దృష్ట్యా హిందీలో రిలీజ్ చేయబోతుండటం విశేషం. 

దీంతోపాటు గోల్డ్ మైనింగ్‌ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మించిన మరో చిత్రం `రంగస్థలం`ని కూడా హిందీలో విడుదల చేయబోతున్నారు. రిపబ్లిక్‌ డే కానుకగానే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. తెలుగు సినిమాలకు హిందీలో ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో దాన్ని మరింతగా వాడుకోవాలని భావిస్తున్నారు హిందీ మేకర్స్. ఇప్పటికే బన్నీ సినిమా `పుష్ప`తో బాగా పిండుకున్నారు. మరోవైపు `అల వైకుంఠపురములో`తో మరికొంత పిండుకోబోతున్నారు. దీంతోపాటు చరణ్‌ సినిమా `రంగస్థలం`  ద్వారా మరింతగా క్యాష్‌ చేసుకోబోతున్నారు. 

రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన `రంగస్థలం` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించగా, మైత్రీ  మూవీ మేకర్స్  నిర్మించారు. ఇది 2018లో విడుదలై దాదాపు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది.  సంచలన  విజయం సాధించింది. ఇందులో చరణ్‌ చిట్టిబాబు అనే వినికిడి లోపం ఉన్న పాత్రలో అదరహో అ

click me!