Kriti Sanon on Body Shaming: నేనేం ప్లాస్టిక్‌ బొమ్మని కాదు.. బాడీ షేమింగ్‌పై ప్రభాస్‌ భామ కృతి ఘాటు వ్యాఖ్యలు

Published : Jan 18, 2022, 08:17 AM IST

మహేష్‌ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కృతి సనన్‌ ఉన్నట్టుండి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను బాడీ షేమింగ్‌కి గురైనట్టు వెల్లడించింది.   

PREV
16
Kriti Sanon on Body Shaming: నేనేం ప్లాస్టిక్‌ బొమ్మని కాదు.. బాడీ షేమింగ్‌పై ప్రభాస్‌ భామ కృతి ఘాటు వ్యాఖ్యలు

ప్రస్తుతం ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో సీతగా నటిస్తున్న కృతి సనన్‌.. లేటెస్ట్ గా ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. బాడీ షేమింగ్‌పై స్పందించింది. తాను కెరీర్‌ ప్రారంభంలో బాడీ షేమింగ్‌కి గురైనట్టు తెలిపింది. ఆ నాటి రోజులను గుర్తు చేసుకుందీ పొడుగుకాళ్ల సుందరి. సన్నని  జాజిమల్లెలా ఉండే కృతి దారుణమైన కామెంట్ల ఎదుర్కొందట.
 

26

తన నవ్వుపై కూడా కామెంట్లు చేశారని తెలిపింది కృతి. `నువ్వు నవ్వితే బావుండవు` అని అన్నారట. అంతే కాదు, ఆమె పెదాల ఆకృతి మార్చుకోమని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకోమని సలహా ఇచ్చారట. మరికొందరు ముక్కుని  టార్గెట్ చేశారట. ఆమె నవ్వినప్పుడు నాసికా రంధ్రాలు ఎర్రబడతాయని ఎత్తి చూపారట. అలా జరగటం నిజమే అని ఒప్పుకున్న కృతీ... `నేనేం ప్లాస్టిక్ బొమ్మని కాదు కదా` అంటోంది. 

36

అంతటితో ఆగలేదు.. తన నడుముపై కూడా ట్రోల్స్ చేశారట. తన నడుముని కూడా ఇంకాస్త తగ్గించమని చెప్పారట. ఇంతటి షాకింగ్‌ కామెంట్లని తాను వినాల్సి వచ్చిందని ఆవేదన చెందుతుంది కృతి. అయితే ఆ కామెంట్లని తాను పట్టించుకోలేదని, తనకు నచ్చినట్టు ఉన్నానని తెలిపింది కృతిసనన్‌.  తనలా మాత్రమే తాను ఉంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు కోట్లాది మందికి అభిమాన నాయిక అయింది. మిగతా వారికి కూడా ఆమె అదే చెబుతోంది. ఎవరెవరో వచ్చి ఏదేదో చెబితే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది కృతి సనన్‌. 

46

కృతిసనన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తుంది. తన తొలి చిత్రం `వన్‌ః నేనొక్కడితో` మహేష్‌తో కలిసి నటించే అరుదైన ఛాన్స్ దక్కించుకుంది. తొలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది కృతి. ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకున్నా, కృతికి మంచి పేరు దక్కింది. బాలీవుడ్‌కి చెక్కేసింది. 
 

56

`హీరోపంతి` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ తొలి చిత్రంతో హిందీ ఆడియెన్స్ ని అలరించింది. `దిల్‌వాలే`, `రాబ్తా`, `బేరెల్లీ కి బర్ఫీ`, `లుక చుప్పి`, `అర్జున్‌ పాటియాలా`, `హౌజ్‌ఫుల్‌4`, `పానిపట్‌`, `మిమి` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 
 

66

ప్రస్తుతం `బచ్చన్‌ పాండే`, `షేహజాడా`, `బేదియా`, `గణపత్‌` చిత్రాలు చేస్తుంది. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ  సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories