ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ దూకుడు.. ఇంకా ఏఏ కేటగిరీల్లో నామినేట్ అయ్యే అవకాశముందంటే!?

First Published Dec 22, 2022, 2:18 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ (Oscars2023) రేసులో దూసుకుపోతోంది. తాజాగా 95వ అకాడమీ అవార్డ్స్ షార్ట్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా ఏఏ కేటగిరీల్లో నామినేట్ అయ్యే అవకాశముందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తే అవార్డు వేడుకల్లో ‘ఆస్కార్స్’ ప్రధానమైంది. ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ RRR ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అవుతుందని భావించారు. కానీ, అధికారికంగా ఎంట్రీ ఇవ్వకపోవడంతో జనరల్ కేటగిరీలో 15 విభాగాల్లో ఆస్కార్స్ నామినేషన్ కు పంపించారు. 
 

ఈ సందర్భంగా మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందింది.  లేటెస్ట్ గా విడుదలైన 95వ అకాడమీ అవార్డ్స్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ కు చోటుదక్కడం విశేషం. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో  సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu) షార్ట్ లిస్ట్ అయ్యింది. దీంతో తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు దక్కింది.
 

మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’కు ఒక్క కేటగిరీలో చోటు దక్కడంతో మరిన్ని కేటగిరీల్లోనూ నామినేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే  బెస్ట్ డైరెక్టర్(రాజమౌళి), బెస్ట్ యాక్టర్ (ఎన్టీఆర్ - రామ్ చరణ్), ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, సపోర్టింగ్ యాక్ట్రెస్, యాక్టర్, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, ఒరిజినల్ సాంగ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీల్లో నామినేషన్ కు పంపించారు. 

ఈ క్రమంలో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా నామినేట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లోనూ నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగానూ ఎంఎం కీరవాణీ  అవార్డు అందుకుంటారని ఆశిస్తున్నారు. ఇక ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ లో నిలిచిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ గా ‘నాటు నాటు’ రికార్డు  క్రియేట్ చేసింది. ఫైనల్ లిస్టులో నిలుస్తుందా అన్నది వేచి చూడాలి. 
 

రాజమౌళి దర్శకత్వంలో ఎపిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన  ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సీక్వెల్స్, విజువల్స్ పరంగానూ దుమ్ములేపింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ బ్లాక్ బాస్టర్ ఫల్మ్ ఇప్పటికీ హాలీవుడ్ క్రిటిక్స్ ప్రశంసలు పొందుతూ  సెన్సేషన్  గా నిలుస్తోంది. ఇక తాజాగా వచ్చిన అకాడమీ అవార్డ్స్ షార్ట్ లిస్టులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా ‘లాస్ట్ ఫిల్మ్ షో’ నిలిచింది. 
 

బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు క్రియేట్ చేసింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో భారతీయ చిత్రంగా నిలిచింది. ఉద్యమ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జీవించారు. రాజమౌళి దర్శకత్వం వహించగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చరణ్ సరసన నటించింది. అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ఆయా పాత్రల్లో అలరించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు.
 

click me!