లండన్ లో RRR హీరోల సందడి.. వేదికపైనే ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్

Published : May 12, 2025, 07:10 AM IST

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన చిత్రం RRR. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది.

PREV
17
లండన్ లో RRR హీరోల సందడి.. వేదికపైనే ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటించిన చిత్రం RRR. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. హాలీవుడ్ వాళ్లు సైతం తెలుగు సినిమా వైపు చూసి ఎలా RRR సంచలనాలు సృష్టించింది. ఆర్ఆర్ చిత్రానికి తాజాగా మరో గౌరవం దక్కింది.

27
RRR Movie

లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం  రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
 

37
RRR Movie

రాంచరణ్, ఎన్టీఆర్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లోకి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒకే వేదికపై RRR త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
 

47
RRR Movie

రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై  రాంచరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలో మే 20న ఎన్టీఆర్ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాంచరణ్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ కి అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలిపారు.
 

57
RRR Movie

వీళ్ళిద్దరి బాండింగ్ మరోసారి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా  రాంచరణ్  గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. రామ్ చరణ్ భోజనం తో పాటు తన డైట్ లో వెన్నపూస కూడా తింటారని తెలిపారు.
 

67
RRR Movie

రాయల్ ఆల్బర్ట్ హాల్ మొత్తం రాంచరణ్ , ఎన్టీఆర్  నినాదాలతో ఫ్యాన్స్ మోత ఎక్కించారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ చేసే తొలి అవకాశం దక్కించుకున్న విదేశీ చిత్రం బాహుబలి 2. ఆ తర్వాత ఈ ఘనత RRR చిత్రానికి దక్కింది.
 

77
RRR Movie

RRR మూవీ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలపై ఫిక్షనల్ కథాంశంతో రూపొందింది. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories