‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ అలియా భట్ కిల్లింగ్ లుక్స్.. ట్రెండీ వేర్ లో అట్రాక్ట్ చేసేలా ఫోజులు..

First Published | Sep 23, 2023, 6:26 PM IST

బాలీవుడ్ నటి అలియా భట్ తన లేటెస్ట్ లుక్ తో అట్రాక్ట్ చేస్తోంది. ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. నయా లుక్ కు ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సీత పాత్రలో, రామ్ చరణ్ సరసన నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. టాలీవుడ్ లోకి ఎంట్రీతోనే అదరగొట్టింది.
 

ఆ తర్వాత అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. మళ్లీ సినిమాల పరంగా జోరు పెంచింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి ‘బ్రహ్మస్త్ర’తో అలరించింది.
 


ఇక రీసెంట్ గా అలియా భట్ .. ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’తో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. నెక్ట్స్ బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీకి పెద్దగా సినిమాలు లేవు. తదుపరి చిత్రాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

ఇక అలియా సినిమా పరంగా జోష్ తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా మెరిసింది. గుచ్చి బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది.

గ్రీన్ టాప్, బ్లూ జీన్స్ లో అలియా కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే ఫోజులతో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. అలియా నయా లుక్ కు నెటిజన్లు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

కెరీర్ పరంగా అలియా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే షూట్ కు కూడా హాజరైంది. ఇక నెక్ట్స్ ప్రాజెక్స్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!