Rowdy Boys : రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ..కొత్త హీరో సెట్ అయినట్టేనా..?

First Published | Jan 14, 2022, 1:18 PM IST

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి సినిమా వారసత్వం తీసుకుని.. రౌడీబాయ్స్ సినిమాతో.. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. దిల్ రాజు బ్యానర్ లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా హుషారు ఫేమ్ హర్ష కోనుగంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలాంటి రిజల్డ్ అందించింది. హీరోగా ఆశిష్ నిలబడతాడా.. రౌడీ బాయ్స్ సినిమా రివ్యూ చూద్దాం.

ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం.. దిల్ రాజు బ్యానర్ లో ఆయన వారసుడే హీరోగా ఇండస్ట్రీకి పరచయం అవుతుండటంతో.. అందరి చూపు ఈ సినిమా వైపే పడింది. అందులోను కొత్త హీరో పక్కన హీరోయిన్ గా  అనుపమా పరమేశ్వరన్ కనపిస్తుండటం... సినిమాపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ చూశాక అమాంతం అంచనాలు పెరిగాయి. అందులోను ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటిస్టార్స్ ప్రమోషన్ చేయడంతో.. సినిమా గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు.

ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. అక్షయ్( ఆశిష్)బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగే కుర్రాడు.. కావ్య(అనుపమా పరమేశ్వరన్) మెడికల్ స్టూడెంట్. బీటెక్ లో చేడానికి వెళ్తూ.. కావ్యను చూస్తాడు అక్షయ్.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. అక్షయ్ జాయిన్ అయిన కాలేజీకి.. కావ్య చదువుతున్న కాలేజీకి అస్సలు పడదు. గ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మరో వైపు కావ్యను అక్షయ్ తో పాటు.. తన క్లాస్ మెట్ కూడా ప్రేమిస్తుంటాడు. ఇన్ని ట్విస్ట్ ల మధ్య హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది  సినిమా.


హుషారు లాంటి యూత్‌ఫుల్ సినిమా  చేసిన  శ్రీహర్ష ను నమ్మి పెద్ద బాధ్యత పెట్టారు దిల్ రాజు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయడం అంటే ఆ ప్రెజర్ గట్టిగానే ఉంటుంది. అయినా సరే డాన్స్, యాక్షన్, కామెడీ, హీరో, హీరోయిన్లు నటించడానికి స్కోప్ ఉన్న మంచి కథను హర్ష ఎంచుకున్నాడు. కాని స్క్రీన్ మీద మాత్రం కరెక్ట్ గా ప్రజెంట్ చేయించలేకపోయాడు. తను అనుకున్న కథను కరెక్ట్ గా పేపర్ మీద పెట్టాడు కాని.. స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. దాంతో సినిమా కొంచెం కన్యూజ్ చేస్తుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. హీరోగా ఆశిష్ సక్సెస్ అయినట్టే అనాలి. హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ తనకు ఉన్నాయి అని ఈసినిమాతో నిరూపించుకున్నాడు అశిష్. యాక్షన్ డాన్స్ పరంగా ఇరగదీశాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో కొంచెం తడబడినా.. కొత్త హీరో.. కొత్త హీరోనే అనిపంచేలా చేశాడు ఆశిష్. సినిమాలు చేస్తుంటే షైన్ అవుతాడు అనిపించేలా కన్విన్సింగ్ గా నటించాడు అశీష్.  

అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన కెరీర్ లో ఇంత వరకూ ఇలా చేసి ఉండదు అనుపమ. సినిమా అంతా తనే నడిపిస్తుంది అనడంలో  అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తన కెరీర్ లో ఇంత బోల్డ్ గా కూడా అనుపమా నటించింది లేదు. కిస్ సీన్స్ అస్సలు చేయదూ అనుకుంటే.. ఈసినిమాలో సిచ్యూవేషన్ డిమాండ్ తో రెచ్చిపోయింది మలయాళ బ్యూటీ. కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్త.. దేవిశ్రీ మ్యూజిక్ చాలా బాగా అందించారు. వినడానికి చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటో గ్రఫి అద్భుతంగా ఉంది. దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా.. భారీగా తన వారసుడిని లాంచ్ చేశాడు. ఎక్కడా తగ్గలేదు. ఓవ్ ఆల్ గా రౌడీ బాయ్స్ సినిమా పర్వాలేదు అనిపించింది. మంచి కథను డైరెక్టర్ ఎంచుకున్నా.. కథనం విషయంలో దెబ్బ తగిలింది. సినిమా కొంచెం స్లో అయ్యింది అయినా సరే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్లు మాత్రం ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు.  

Latest Videos

click me!