Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్

Published : Aug 28, 2026, 11:51 AM IST

ప్రస్తుతం జానపద పాటల ట్రెండ్ నడుస్తోంది.. సినిమా పాటల కంటే ఈ పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే ఈ ఫోక్ సాంగ్స్ కోట్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి ఓ హిట్ సాంగ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
సూపర్ హిట్ జానపదం

Folk Song : ప్రస్తుతం సినిమా పాటల కంటే జానపద పాటలకే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. ప్రజలు ఈ పల్లె పాటలకే పట్టం కడుతున్నారు... అందుకే ఎక్కడ విన్నా జానపద పాటలే వినిపిస్తున్నారు. 'రాను బొంబైకి రాను', 'బాసింగ బాసింగా బలాలే' వంటి ఫోక్ సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే… ఇలాంటి పాటలు కోట్ల వ్యూస్, లక్షల లైక్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇలాంటి హిట్ పోక్ సాంగ్స్ లో టాప్ లో ఉంది 'నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల' సాంగ్.

24
యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న అందాల జాబిల్లివే సాంగ్..

అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకు సంబంధించిన సినిమా పాటలు, జానపదాలు అనేకం వచ్చాయి. ఇందులో అమ్మాయిని అందాన్ని వర్ణిస్తూ ఆమెను మెప్పించేందుకు ప్రియుడు ప్రయత్నిస్తాడు... ఇది ప్రేమ పాటల సూపర్ హిట్ ఫార్ములా. ఇది అందాల జాబిల్లి పాటలోనూ వినిపిస్తుంది. అయితే ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే పల్లెటూరి ప్రేమికుల మధ్య సాగే లవ్ డ్యుయెట్... అందుకే అక్కడి ప్రకృతిలాగే ఈ పాటలోని పదాలు కూడా స్వచ్చంగా ఉంటుంది... ఎలాంటి వల్గారిటీ ఉండదు. అందుకే ఈ పల్లె పాటను తెలుగు ప్రజలు ఇష్టపడ్డారు... అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ టాప్ వీడియోల జాబితాలో చేర్చారు.

సరిగ్గా నాలుగేళ్ల కింద (2022) ఇదే ఆగస్ట్ లో నిండు పున్నమి వేళ ఫోక్ సాంగ్ విడుదలయ్యింది... సుమన్ ఫోక్ మ్యూజిక్ యూట్యుబ్ ఛానల్ ద్వారా జనాల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఈ పాట దూసుకుపోతూనే ఉంది... ఇప్పటికీ ఈ పాట గట్టిగానే వినిపిస్తుంటుంది. ఇలా యూట్యూబ్ ను షేక్ చేస్తూ ఇప్పటివరకు 237 మిలియన్స్ అంటే 23 కోట్లకు పైగా వ్యూస్, 641K లైక్స్ సాధించింది. ఈ జానపద పాటద్వారా స్వచ్చమైన పల్లె ప్రేమకు అభిమానులు పట్టం కట్టారు.

34
అందాల జాబిల్లి ఫోక్ సాంగ్ వెనకున్న టీమ్ ఇదే..

''నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే'' అంటూ సాగే ఫోక్ ఈ స్థాయిలో హిట్ అయ్యిందంటే అందుకు ప్రధాన కారణం సుమన్ బదనకల్... ఈయనే ఈ పాటకు ప్రొడ్యూసర్. అంతేకాదు అమ్మాయి అందాలను వర్ణిస్తూ లిరిక్స్ రాసింది ఈయనే... ఆ పదాలకు ప్రాణం పోసేలా పాడింది కూడా ఇతడే. చివరకు ఈ పాటలో కూడా నటించారు. ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసి ఈ పాటను హిట్ ఫోక్స్ జాబితాలో చేర్చారు సుమన్.

సుమన్ బదనకల్ తో పాటు కార్తిక్ రెడ్డి, లాస్య స్మైలీ అద్భుతమైన డ్యాన్స్, హావభావాలతో ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు. సింగర్ శ్రీనిధి గొంతు కూడా ఈ పాటకు ప్లస్ అయ్యింది. ఇక డైరెక్టర్ సురేష్ సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... పల్లెటూరి ప్రేమను అద్భుతంగా చూపించారు... , డిఓపి, ఎడిటర్ కూడా ఈయనే. మ్యూజిక్ కల్యాణ్ కీస్ అందించారు.

44
అందాల జాబిల్లివే సాంగ్ లిరిక్స్

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే ....

కొంటెచూపులవాడ కోరినన్నడగంగ కోరిక నీకేలరా ఓ పిలగ... సాలించునీమాటరా....

నా ఊహలారాణి నువ్వెనాతోడని పేరు రాసుకున్ననే...

కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందమని రూపు గీసుకున్నానే...

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే ....

కొంటెచూపులవాడ కోరినన్నడగంగ కోరిక నీకేలరా ఓ పిలగ... సాలించునీమాటరా....

సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే

ఓ పిల్ల పాట కోయిలమ్మవే....

మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకురా..

ఓ పిలగ నన్నేదో సేయకురా.....

పచ్చిపాల తీరు నీలేత నవ్వులు ఎంతో ముద్దుగున్నవే...

నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే..

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే ....

కొంటెచూపులవాడ కోరినన్నడగంగ కోరిక నీకేలరా ఓ పిలగ... సాలించునీమాటరా....

తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే

ఓ పిల్ల... సూడ సక్కని గుమ్మవే..

కనుసైగ జేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు

ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా...

ఆ రంభ ఊర్వశి ఈ నేలనా జారి నీలా మారెనేమొనే...

ఏ జన్మల జేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే ....

కొంటెచూపులవాడ కోరినన్నడగంగ కోరిక నీకేలరా ఓ పిలగ... సాలించునీమాటరా....

ఆశలెన్నో లోన చిగురిస్తున్న ఉన్నవి నన్ను అడుగుతున్నవే...

ఓ పిల్ల నిన్ను కోరుతున్నావే...

మాయేదోజేసినవ్ నా మనసుదోసినావ్ నా లోకమైనావురా ఓ పిలగా నీ మీద మనసాయెరా...

నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగ నిన్ను కొలుసుకొంటానే...

అడుగుల అడుగేసి నీలోన సగమై నిన్ను జూసుకొంటానే

ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే

ఓ పిల్ల కలకాలం కలిసుందమే...

ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటరా

ఓ పిలగ కలకాలం కలిసుంటారా.....

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల.. సొగసైన సిరిమల్లెవే ....

కొంటెచూపులవాడ కోరినన్నడగంగ కోరిక నీకేలరా ఓ పిలగ... సాలించునీమాటరా…

Read more Photos on
click me!

Recommended Stories