Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?

Published : Aug 28, 2026, 11:46 AM IST

Kiku Chiranjeevi Movie Review: ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉంటే, దీని వల్ల వచ్చే సమస్యలేంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు?.. ఈ క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే `కికు చిరంజీవి`. ఈ రోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?

PREV
16
కికు చిరంజీవి మూవీ రివ్యూ

కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన మూవీ `కికు చిరంజీవి`. దీని అసలు పేరు `చిరంజీవి`. కానీ టైటిల్‌ విషయంలో కొందరు అభ్యంతరాలు తెలియజేయడంతో `కికు చిరంజీవి`గా మార్చారు. ఈ మూవీకి శుభ సాయి వెంకట్‌ దర్శకత్వం వహించారు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఇందులో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ భరత్‌(అయ్యంగార్‌), వైవా రాఘవ, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రమోషన్స్ తో టీమ్‌ సినిమాపై అంచనాలను పెంచింది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా? కంటెంట్‌ కొత్తగా ఉందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
కికు చిరంజీవి కథ

చిరంజీవి(కికు యనమల) అరుదైన గుండె సమస్యతో బాధపడుతుంటాడు. తనొక ఫోటోగ్రాఫర్‌. అదే సమయంలో అనాథ. అలాగే మను(కశిష్‌ ఖాన్‌) కూడా అనాథ. ఆమెని శ్రీకాంత్ అయ్యంగార్‌ దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తాడు. ఆమెకి పెళ్లి చేయాలని చూస్తాడు, కానీ పిల్లలు కనకుండా ఉండటానికి ఒప్పుకున్న అబ్బాయినే మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటుంది. తనలాగే మరొకరిని తాను దత్తత తీసుకోవాలనుకుంటుంది. దీంతో చాలా సంబంధాలు చెడిపోతాయి. ఫైనల్‌గా ఒక వ్యక్తి ఒప్పుకుంటాడు. అతన్ని కలిసేందుకే ఫ్రెండ్స్ తో కలిసి టూర్‌ వెళ్తుంటుంది. వీరి టూర్‌ని కవర్‌ చేయడానికి చిరంజీవి వస్తాడు. అనంతరం మనుని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి బస్‌ కింద పడి చనిపోతాడు. ఇది అందరిని షాక్‌కి గురి చేస్తుంది. అనంతరం వీరంతా ఫారెస్ట్ లోకి వెళ్తారు. అక్కడ కొందరు వీరిని వెంటాడుతుంటారు. దీంతో అంతా పారిపోతారు. పరిగెత్తడం వల్ల చిరంజీవికి ఆక్సిజన్‌ అందక ఒళ్లంతా నీలిరంగులోకి మారుతుంది. అప్పుడు ఆసుపత్రిలో చేర్పించడం వల్ల తన హార్ట్ కుడివైపు ఉందని చెబుతాడు. అనంతరం చిరు, మను ఫారెస్ట్ లో తప్పిపోతారు. వీరు ఫారెస్ట్ లో ఒక ప్రెగ్నెంట్‌ లేడీని కాపాడి, అటవి ప్రజల మన్ననలు పొందుతారు. కానీ బీచ్‌లో కొందరు దుండగులు చిరుపై దాడి చేసి కత్తిపోట్లు పొడుస్తారు. ఆ సమయంలో ఈశ్వరీరావు తన కారులో లిఫ్ట్ ఇచ్చి చిరంజీవి ప్రాణాలు కాపాడుతుంది. ఆమె కొడుకు విషయంలో బాధపడుతున్న ఒక రిచ్‌ లేడి. చిరుని చూడగానే ఆమె గుండెతరుక్కుపోతుంది. తన గతాన్ని గుర్తు చేయగా, చిరంజీవినే తన కొడుకని తెలుస్తుంది. దీంతో వీరిద్దరు కలిసిపోతారు. చిరంజీవికి మను కూడా పడిపోవడంతో పెళ్లి చేస్తారు. ఫస్ట్ నైట్‌ జరుగుతుంది. మను మార్నింగ్‌ లేచి చూస్తే, కుడివైపు ఉండాల్సిన చిరు గుండె ఎడమవైపు కొట్టుకుంటుంది. దీంతో షాక్‌ అవుతుంది. చిరు మారిపోయాడని ఆశ్చర్యపోతుంది. మరి ఒక్క రాత్రిలో కుడివైపు ఉండాల్సిన చిరు గుండె ఎడమవైపు ఎందుకు కొట్టుకుంటుంది? అనంతరం మను రియాక్షన్‌ ఏంటి? ఈశ్వరీరావు వీరి లైఫ్‌లోకి ఎందుకు వచ్చింది? బస్సు డ్రైవ్‌ చేసిన స్పైడర్‌ మ్యాన్‌ ఎవరు? అనంతరం ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి, కథ ఎలాంటి మలుపు తీసుకుందనేది సినిమా.

36
కికు చిరంజీవి మూవీ విశ్లేషణ

గుండె ఎడవైపు కాకుండా, కుడివైపు ఉందనే కాన్సెప్ట్ తో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. ఈ కాన్సెప్ట్ కొత్త కాకపోయినా, ఇందులో కొత్తగా ప్రజెస్ట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. `చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్‌ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. ఇక సినిమాగా చూసినప్పుడు ఇది ప్రారంభంలో హీరోహీరోయిన్ల పాత్రలని పరిచేస్తూ, టూర్ ద్వారా వీరిద్దరిని కలుపుతారు. ఈసన్నివేశాలు సరదాగా సాగుతాయి. ఈ క్రమంలోనే హీరోకి బ్రీతింగ్‌ సమస్య, హార్ట్ సమస్య ఉందని తెలుస్తుంది. అనంతరం ఫారెస్ట్ లో కొందరు దుండగులు వెంటాడటం, ఈ క్రమంలో పారిపోవడం, చిరుని రక్షించుకునేందుకు ఆమె బ్రీతింగ్‌ ఇవ్వడం వంటి సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే అప్పటి వరకు కొంత స్లోగా సాగుతుంది. ఏం జరుగుతుందనేది క్లారిటీ మిస్‌ అవుతుంది. బీచ్‌లో హీరోకి కత్తిపోట్ల తర్వాత సినిమా సీరియస్‌గా మారుతుంది. అసలైన కథ అప్పుడు స్టార్ట్ అవుతుంది. హీరో లైఫ్‌లోకి ఈశ్వరీరావు రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. వీరు కలిసిపోవడం, హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం, ఫస్ట్ నైట్‌ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్‌ తో ఇంటర్వెల్‌.

కుడి వైపు ఉండాల్సిన హార్ట్ ఎడమవైపు కొట్టుకుంటే.. తాను ఫస్ట్ నైట్‌ చేసింది ఎవరితో అని హీరోయిన్‌ టెన్షన్‌ పడటంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. అతను ఎవరు? తన వాడు ఎవరనేది ఆమె పడే బాధ, స్ట్రగుల్‌, టెన్షన్‌ భయటం ఎంగేజ్‌ చేస్తాయి. అదే సమయంలో చిరంజీవిలో అనూహ్యమైన మార్పులు, సైకోలా ప్రవర్తించడం వంటి సీన్లు సినిమాపై క్యూరియాసిటీని, ఇంట్రెస్ట్ ని పెంచుతాయి. ఆయా సీన్లు ఎంగేజ్‌ చేస్తాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠకి గురి చేస్తాయి. సెకండాఫ్‌ మొత్తం థ్రిల్లర్‌గా మారిపోతుంది. ఆ తర్వాత అంతకు ముందు ఉన్న ట్విస్ట్ లు ఒక్కోటి రివీల్‌ అవుతాయి. చిరంజీవి పాత్రలోని ట్విస్ట్, మాస్క్ మ్యాన్‌ ఎవరు అనేది? తనికెళ్ల భరణి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నాడు? ఫస్ట్ నైట్‌లో చిరంజీవి ఎలా మారిపోయాడు? అసలు హీరోయిన్‌ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే మొదటి భాగం స్లోగా ఉంటుంది. సీరియల్‌ని తలపిస్తుంది. సీన్లు వచ్చిపోతుంటాయి కానీ, అందులో ఎమోషన్‌ లేదు, ఫీల్‌ లేదు, లవ్‌ కనిపించదు. రొమాన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. డ్రామా ఓవర్‌గా ఉంటుంది. సహజత్వం మిస్‌ అయ్యింది. కానీ ఇంటర్వెల్‌ ట్విస్ట్ తో సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌ మాత్రం ఎంగేజ్‌ చేస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది.

46
కికు చిరంజీవిలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే

చిరంజీవిగా హీరో కికు యనమల అదరగొట్టాడు. ఆయన డిఫరెంట్‌ షేడ్స్ చూపించి మెప్పించాడు. ఫన్నీగా, సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ అదిరిపోయింది. అదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. హీరోగా మొదటి సినిమా అయినా కికు యనమల మాత్రం రెచ్చిపోయి యాక్ట్ చేశాడు. ఆయనకు మంచి ప్రశంసలు దక్కుతాయి. ఇక మనుగా కశిష్‌ ఖాన్‌ ఉన్నంతలో ఫర్వాలేదు. నటిగా బాగా చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే ఓవర్‌గా యాక్ట్ చేసింది. చిన్న ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా ఇచ్చింది. ఆమె నటన కొంత అసహజంగా అనిపిస్తుంది. ఈశ్వరీరావు ఉన్నంతలో మెప్పించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి ఫర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

56
కికు చిరంజీవి టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

రామకృష్ణ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ హైలైట్గా నిలుస్తుంది. సస్పెన్స్ అంశాలు, థ్రిల్లర్‌ అంశాల్లో బాగా చేశారు. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఇంకొంత కట్‌ చేయోచ్చు. ఉన్నంత షార్ప్ గా చేశారు. దీప్తి నడిమింటి నిర్మాణ విలువలకు కొదవ లేదు. చిన్న సినిమా అయినా బడ్జెట్‌ విషయంలో రాజీ లేకుండా నిర్మించారు. ఒక రిచ్‌ మూవీని అందించారు. దర్శకుడు శుభ సాయి వెంకట్‌ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది. సీరియల్‌ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సెకండాఫ్‌ని బాగానే డీల్‌ చేశాడు. ట్విస్ట్ లు, డ్రామా, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలు బాగానే రాసుకున్నాడు. ఫన్‌, రొమాన్స్, యాక్షన్‌ అంశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లోనే కొంత లోపం కనిపిస్తుంది. సెకండాఫ్‌ని కొంత వరకు బెటర్‌గానే చేయగలిగాడు, దీంతో సినిమా లెక్క మారిపోయింది. ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేశాడు.

66
ఫైనల్‌గా

హార్ట్ కుడివైపు ఉండటమనే పాయింట్‌ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత వరకు ఎంగేజ్‌ చేసే సర్వైవల్‌ డ్రామా థ్రిల్లర్‌ `కికు చిరంజీవి`.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories