చివరికి అవినాష్ ప్రేమను అర్థం చేసుకున్న ఆరియానా...బావా అంటూ కౌగలించుకుంది

First Published | Oct 25, 2020, 12:18 AM IST

బిగ్ బాస్ రియాలిటీ షో మరో వీకెండ్ కి చేరుకుంది. నేడు శనివారం కావడంతో మరింత మజాగా బిగ్ బాస్ హౌస్ సిద్ధం అయ్యింది. ఐతే వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలి వెళ్లిన నాగార్జున నేడు షో హోస్టుగా హాజరుకాలేకపోయారు. దీనితో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది.

ఐతే ప్రేమ మొదలైంది అనే సినిమా నిర్మించిన బిగ్ బాస్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ పంచారు. ఈ సినిమాలో పాత్రలుగాఅఖిల్, మోనాల్, అవినాష్, ఆరియానా, మెహబూబ్ మరియు సోహైల్, హారికలను తీసుకోవడం జరిగింది. అఖిల్, మోనాల్ మెయిన్ హీరో హీరోయిన్ గా చేయగా అవినాష్, ఆరియానా సెకండ్ హీరోయిన్, హీరోలుగా చేశారు. ఇక మెహబూబ్ విలన్ గా సోహైల్, హారిక ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు.
యాంగ్రీ స్టార్ గా అఖిల్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ , ఎమోషనల్ స్టార్ గా మోనాల్ అభివర్ణించారు. వీరిద్దరూ బిగ్ బాస్ కాలేజ్ లో చదువుతున్నారు.

అదే కాలేజ్ లో చదువుతున్నసభాషిణి(ఆరియానా) కూడాఅఖిల్ ని ఇష్టపడుతుంది. సుభాషిణిని సుబ్బలక్ష్మీగా పిలుచుకునే పల్లెటూరి బావ పాత్రలో అవినాష్ కనిపించారు. మరదలు అంటే చచ్చేంత ప్రేమ కలిగిన అవినాష్ఆమెకు తన ఇష్టం తెలియజేయగా సుబ్బలక్ష్మీ ఛీ కొడుతుంది.
ఐతే విలన్ మెహబూబ్మెహబూబ్ ఆమెను వేధించే క్రమంలోఅవినాష్ఆమె కోసం మెహబూబ్ ని ఎదిరిస్తాడు. ఆ సమయంలో బావ అవినాష్ పై సుబ్బలక్ష్మీ కి ప్రేమ పుడుతుంది.అమ్మాయిలను వేటాడే మెహబూబ్ ని అఖిల్ ఎదిరిందిజైలుకిపంపిస్తాడు. జైలు నుండి బయటికి వచ్చిన మెహబూబ్ అఖిల్ పై పగ తీర్చుకొనే ప్రయత్నం చేస్తాడు. ఐతే అఖిల్ మెహబూబ్ కి బుద్ది చెవుతాడు. మోనాల్అఖిల్ తో... అవినాష్ఆరియానాతో ప్రేమలో మునిగిపోగా మూవీ ముగుస్తుంది.
ఈ మూవీ మధ్యలోసోహైల్ మరియు హారిక మధ్య వచ్చిన ఐటెం సాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ మూవీ కోసం బిగ్ బాస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ యాక్టర్ గా అవినాష్, బెస్ట్హీరోగా అఖిల్, బెస్ట్ స్టైలిస్ట్అవార్డు లాస్యకుఇవ్వడం జరిగింది. అలాగే డ్రీం గర్ల్ అవార్డు మోనాల్ కి, బెస్ట్ విలన్ అవార్డుమెహబూబ్ కి, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ రాజశేఖర్ మాస్టర్ కి ఇచ్చారు.
అలాగే బెస్ట్ అప్ కమింగ్డైరెక్టర్ అభిజిత్,ఐటెం రాణి అవార్డుహారికకు, ఐటెం రాజా అవార్డుసోహైల్ కి ఇచ్చారు. ఇంటి సభ్యుల రెండు ఫోటోలకు అవినాష్ ఇచ్చిన వివరణ బాగుంది. కాగా రేపు ఏంజెల్ సమంత బిగ్ బాస్ హోస్ట్ గా రానుంది.

Latest Videos

click me!