ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రోజా.. పొలిటికల్ గా మాత్రం ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది. ఆ మధ్య ఇంటర్వ్యూలో ఆమె బాలయ్య, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏన్నదంటే?
90 స్ లో తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఏలింది రోజా సెల్వమణి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. రోజా. ఆమె నవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమిళంలో కూడా రోజా శరత్ కుమార్, రజినీకాంత్, విజయ్ కాంత్, కార్తీ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెప్పించింది. నిర్మాత సెల్వమణిని ప్రేమించి పెళ్ళాడిన రోజా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఆతరువాత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది రోజా.
26
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా రోజా..
హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన రోజా సెల్వమణి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సీన్ అంతా మారిపోయింది. రోజాలో మరో కోణం బయటకు వచ్చింది. పార్టీలు మారే కొద్ది.. విమర్శలు పెరిగిపోయాయి. రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది రోజా. పొలిటికల్ గా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించింది రోజా. సినిమాల్లో తనతో జోడీగా నటించిన హీరోలనే.. పొలిటికల్ గా ఘాటుగా విమర్శించవలసి వచ్చింది. కానీ పర్సనల్ గా మాత్రం వారితో మంచి రాపో మెయింటేన్ చేసింది రోజా. హీరోయిన్ గా, పొలిటీషియన్ గా స్టార్ డమ్ సంపాదించిన రోజా సెల్వమణి.. మినిస్టర్ గా కూడా పనిచేసింది.
36
బాలయ్య గురించి రోజా ఏమన్నదంటే?
పొలిటికల్ గా ఎన్ని విమర్శలు చేసినా.. బాలయ్యతో పర్సనల్ గా మాత్రం మంచి అనుబంధం ఉండేది రోజాకు. ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ... '' నేను హీరోయిన్ గా పనిచేసిన హీరోలలో బాలయ్య చాలా క్లోజ్ గా ఉంటారు. ఆయన పార్టీ వేరైనా.. నాతో అభిమానంగా ఉంటారు. అసెంబ్లీలో కూడా హాయ్ రోజా ఎలా ఉన్నావ్.. ఏంటి సంగతలు అని అడిగేస్తుంటారు. ఆయన మనసులు ఏ ద్వేషం ఉండదు. అసెంబ్లీలో అందరు షాక్ అవుతుంటారు. వీళ్లు వేరే వేరే పార్టీ కదా.. కొట్టుకుంటారనుకుంటే.. ఇలా క్లాజ్ గా మాట్లాడుకుంటారేంటి అని. బాలకృష్ణ గారు ఎప్పుడు అంటుంటారు. దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చాడు.. నోస్, ఐస్.. భైరవద్వీపం లో క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు..''
రోజా మాట్లాడుతూ.. వెంకటేష్ గారు.. నేను మినిస్టర్ అయ్యాక కలిశారు.. నువ్వ ఈ పోస్ట్ కి అర్హురాలివి.. ఎంత కష్టపడ్డావ్, నీ కష్టానికి మంచి గుర్తింపు ఇది అని అన్నారు. వారి బ్యానర్ లో మేము చాలా సినిమాలు చేశాం, రామానాయుడు గారు ఎలక్షన్ లో నిలబడితే.. వెళ్లి ప్రచారం కూడా చేశాము అని రోజా అన్నారు. ఇక షూటింగ్ లో మాత్రం అంత జోవియల్ గా ఉండరు. బాలయ్యగారు అయితే ఎక్కడెక్కడ ఉన్నోళ్లని దగ్గరకు పిలిచి.. కబుర్లు, పద్యాలు, పాటలు.. సందడి సందడిగా ఉంటుంది. వెంకటేష్ గారు మాత్రం.. కామ్ గా కూల్ గా ఉంటారు. మనం మాట్లాడితేనే మాట్లాడుతారు'' అని రోజా సెల్వమణి అన్నారు.
56
నాగార్జున క్రేజ్ గురించి రోజా కామెంట్స్..
రోజా.. తనతో పనిచేసిన హీరోల గురించి మాట్లాడుతూ.. '' నాగార్జున గారికి మంచి క్రేజ్ ఉండేది. ఆయన అంటే హీరోయిన్లు ఎగబడేవారు. షూటింగ్ లో నాగార్జున ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెతుకుంటూ వెళ్లి కూర్చోవాలని అందరు ఎగబడేవారు. ఆయనంటే ఎందుకో అందరు హీరోయిన్లకు చాలా ఇష్టం. ఆయన కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేవారు. ఎవరినీ హర్ట్ చేసేవారు కాదు, సాధారణంగా హీరోలు మాతోనే కూర్చోని మాట్లాడాలి, డైలాగ్స్ మాకంటే ఎక్కువ ఉండకూడదు లాంటివి ఉంటాయి. కానీ నాగార్జున గారు మాత్రం అలా ఉండేవారు కాదు. ఆయన చాలా కామ్ గా కూల్ గా ఉండేవారు'' అని రోజా అన్నారు.
66
చిరంజీవితో ఫస్ట్ షూట్.. భయపెట్టేశారు..
చిరంజీవి గురించి రోజా మాట్లాడుతూ.. '' చిరంజీవిగారితో డ్యాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం.. ఆయనతో ఫస్ట్ సినిమా.. ఫస్ట్ షార్ట్ డ్యాన్స్ తో స్టార్ట్ అయ్యింది. ఎంత ఘాటు ప్రేమయో సాంగ్ మెగాస్టార్ తో కలిసి చేశారు. ఫస్ట్ సాంగ్.. అది కూడా స్లో సాంగ్ కు డ్యాన్స్ చేయడం అంటే భయం వేసింది. అందులోను చాలామంది నన్ను భయపెట్టారు. నువ్వు అయిపోయావ్.. రెండో టేక్, మూడో టేక్ తీసుకుంటే.. చిరాకు పడి వెళ్లిపోతారు అని భయపెట్టారు. ఆయన మాత్రం అలా అనలేదు.. ఎంత టైమ్ అయినా తీసుకో.. నేర్చుకో అని వెళ్లి కూర్చునేవారు. నాకు సినిమా డ్యాన్స్ రాదు కదా.. అప్పుడికప్పుడే నేర్చుకుని చేసేశాను. అప్పుడు నాకు టైమ్ ఇచ్చి నేర్చుకోమన్నారు. యూనిట్ చెప్పినట్టుగా లేదు. '' అని రోజా అన్నారు.