పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ (Jabardasth)తెలియనివారంటూ ఉండరు. గత దశాబ్ద కాలంగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది ఈ షో. జబర్దస్త్ వేదికగా అనేక మంది నటుల జీవితాలు మారిపోయాయి. కొందరైతే బుల్లితెర స్టార్స్ కూడా అయ్యారు. రష్మీ, అనసూయ హీరోయిన్స్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు.
కొందరు కమెడియన్స్ గా వరుస చిత్రాలు చేస్తున్నారు.ఏజ్ తో సంబంధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో.. భారీ టీఆర్పీ అందుకుంటుంది. జబర్దస్త్ అంటే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న జబర్దస్త్ ని బీట్ చేయాలని ఎన్ని కొత్త షోలు వచ్చినా.. అవి తేలిపోతున్నాయి. మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ షో జడ్జెస్, యాంకర్స్, టీమ్ లీడర్స్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.
29
Actress Roja birthday celebration photos
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కి పనిచేస్తున్న సెలెబ్రిటీలు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం.. జబర్దస్త్ అనే మొదట గుర్తొచ్చే పేరు జడ్జి రోజా(Roja). ఈ షో బిగినింగ్ నుండి ఉన్న రోజా మొదట్లో ఎపిసోడ్ కి మూడు నుంచి నాలుగు లక్షలు తీసుకునేవారట. ప్రస్తుతం రోజా ఒక్కో ఎపిసోడ్ కు 8లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. నాగబాబు షో నుండి బయటికి వెళ్లిపోవడంతో రోజా రెమ్యునరేషన్ డబుల్ అయ్యిందట.
39
నాగబాబు (Nagababu)స్థానం ఎవరు భర్తీ చేయాలని తర్జన భర్జనలు జరిగాయి. ఆలీతో పాటు పలువురు నటుల పేర్లు వినిపించాయి. చివరకు సింగర్ మనుకు ఆ ఛాన్స్ దక్కింది. మను ఎపిసోడ్ కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటున్నారట.
49
బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. జబర్దస్త్ షోలో న్యూస్ రీడర్ నుండి యాంకర్ గా మారిన అనసూయ (Anasuya) ఫేట్ మారిపోయింది. ఇక మొదట్లో అనసూయ ఎపిసోడ్ కు 50 నుండి 80వేలు తీసుకునేవారట. కానీ ఇప్పుడు ఆమె రెమ్యునరేషన్ లక్షన్నర నుండి రెండు లక్షలు తీసుకుంటున్నారట.
59
అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో నటి రష్మీ గౌతమ్(Rashmi gautam) కి ఛాన్స్ దక్కింది. ఇక షోకి వస్తున్న ఆదరణ రీత్యా ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో ప్లాన్ చేయగా.. అనసూయ తిరిగి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీకి కూడా అనసూయతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ఈమె కూడా ఎపిసోడ్ కి ఒకటిన్నర నుండి రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
69
జబర్దస్త్ టీంలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)టీమ్ బెస్ట్ అని చెప్పాలి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కాంబినేషన్ సూపర్ హిట్. నెలవారీ జీతాలు తీసుకునే ఈ ముగ్గురు దాదాపు నెలకు నాలుగు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారట.
79
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ లకు ధీటైన పోటీ ఇవ్వగల కమెడియన్ హైపర్ ఆది. ఈ స్టార్ కమెడియన్ సైతం నెలకు నాలుగు లక్షల పారితోషికం తీసుకుంటున్నారట.
89
పదేళ్లుగా జబర్దస్త్ నే నమ్ముకొని ఉన్నాడు రాకెట్ రాఘవ. అత్యధిక జబర్దస్త్ ఎపిసోడ్స్ లో నటించిన రికార్డు ఆయన సొంతం. రాకెట్ రాఘవకు నెలకు రెండు లక్షలకు పైగా చెల్లిస్తున్నారట. మరో సీనియర్ జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి కూడా రెండు లక్షల వరకు తీసుకుంటున్నారట.
99
ఇక జబర్దస్త్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కమెడియన్స్ లో కొందరు నెలకు యాభైవేలు నుండి లక్ష వరకు పారితోషికం తీసుకుంటున్నారట.