భర్త మాటలు విని కోట్లు నష్టపోయిన రోజా, ఆరోజు ఆ పని చేయకుండా ఉంటే...?

First Published | Jul 7, 2024, 7:12 AM IST

నటి, రాజకీయ నాయకురాలు రోజా తన భర్త మాటలు వినడం వల్ల కోట్లలో నష్టపోయిందని మీకు తెలుసా..? రోజాకు ఏ విషయంలో అంత నష్టం వచ్చింది...? కారణం ఏంటి..? 
 

మాజీ హీరోయిన్.. మాజీ మినిస్టర్..మాజీ ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం తెరమీద ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లోఓడిపోవడంతో..పెద్దగా బయటకు రావడం లేదు రోజా. మరి ఈ హీరోయిన్ నెక్ట్స్ స్టెస్ ఏంటీ అనేది ప్రస్తుతం.. అందరిలో ఉత్కంఠ రేపుతున్న విఫయం. కాగా రోజా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందంటున్నారు కొందరు. లేదు జబర్థస్త్ కు వెళ్లుందంటున్నారు మరికొందరు.. 

roja

అందరు ఏదో ఒకటి అనుకోవడం తప్పించి.. ఆమె నుంచి మాత్రం అఫీషియల్ గా ఇంత వరకూ ఎటుంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా రోజా నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న మాత్రం గట్టిగా వినిపిస్తోంది. రోజా టాలీవుడ్ కు వచ్చినా.. కోలీవుడ్ కు వెళ్ళినా.. అక్కడ రజినీకాంత్ ను, ఇక్కడ మెగా ప్యామిలీని ఆమె అనరాని మాటలు అనడం వల్ల.. రోజాకు ఆఫర్లు రావడం కష్టమనే చెప్పాలి. 


Roja

హీరోయిన్ గా రోజా అటు టాలీవుడ్ ను ఇటు తమిళపరిశ్రమను ఏలింది. తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. రెండు భాషల్లో ఆమెకు పట్టు ఉంది. రెండు ప్రాంతాలపై అవగాహన కూడా ఉంది. దాంతో హీరోయిన్ గా రెండు భాషల్లో రోజా స్టార్ డమ్ ను చూసింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్  హిట్ సినిమాల్లో నటించడంతో పాటు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రోజా. 

 తెలుగులో చిరంజీవి, వెంకీ, నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్, జగపతిబాబు, లాంటి స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ.. తమిళంలో విజయ్ కాంత్, శరత్ కుమార్, అజిత్, మలయాళంలో మమ్ముట్టి లాంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో కూడా అదరగొట్టింది సీనియర్ బ్యూటీ. తాప్సీ, ప్రియమణి లాంటి హీరోయిన్లకు తల్లిగా నటించింది రోజా.  

వెండితెరతో పాటు... బుల్లితెరలో కూడా తన ప్రతాపం చూపించింది రోజా. జబర్థస్త్ జడ్జిగా.. తన మార్క్ చూపించిన ఈ నటి సుధీర్ఘకాలం జబర్థస్త్ జడ్జిగా  చేసింది. ఈ షో వల్ల ఆమో ఆర్ధికంగా కూడా నిలబడింది. ఇక అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు మినిస్టర్ పదవి రావడంతో.. జబర్థస్త్ ను వీడాల్సి వచ్చింది. ఇక ఏపీలో వైసీపీ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా..మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీ ఘోర ఓటమి చూడటంతో.. పెద్దగా బయటకు రావడం లేదు మాజీ మంత్రి. 

ఇక రోజా తమిళ దర్శకుడు సెల్వమణితో గతంలో ఎక్కువ సినిమాలు చేశారు. మొదటి సినిమా టైమ్ లోనే ఆయనతో ప్రేమలో పడ్డ ఆమె.. 2002 లో అతన్ని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. పెళ్ళి తరువాత కూడా రోజా నటించింది. అంతే కాదు భర్త మాటలు విని ఓ సందర్భంలో రోజా  కోట్లకు కోట్లు నష్టపోయిందట. సెల్వమణి వల్ల రోజాకు అంత నష్టం ఎలా వచ్చిందో తెలుసా..? 
 

roja with selvamani

డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సెలవ్వమణి తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ నమ్మకంతోనే సెల్వమణి దర్శకత్వంలో సుమన్ హీరోగా  ఓ సినిమాను రోజా నిర్మించిందట. సమరం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీకోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుకు వేయకుండ రోజా ఖర్చు పెట్టారట. ఈ సినిమా పాటలు అద్భుతంగా వెళ్లడంతో సినిమా కూడా హిట్ అవుతుంది అనుకున్నారట. 

roja

కాని ఈమూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే నెగెటీవ్ టాక్ రావడంతో.. మూవీ ప్లాప్ గా నిలిచిందట. ఈ సినిమా కోసం రోజా పెట్టిన డబ్బంతా ఆవిరై పోవడంతో.. కోట్లలో ఆమె నష్టపోయిందట. చాలా డబ్బు పోగొట్టుకున్న ఈ సినిమా జంట కోలుకోవడం కోసం చాలా టైమ్ పట్టిందని టాక్. ఇలా భర్త సెల్వ మణి వల్ల రోజా కోట్లు నష్టపోవలసి వచ్చింది. 

Latest Videos

click me!