
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బలమైన కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే అతను మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ చేసిన ఓ ట్వీట్ కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది. మరి రోహిత్ రీఎంట్రీ నిజమేనా? వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఎంత?
రోహిత్ ఎలిమినేషన్‌తో షాక్
బిగ్ బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా జరిగే ఎలిమినేషన్‌కు భిన్నంగా, ఈసారి హౌస్‌మేట్స్ నిర్ణయం ద్వారా అతన్ని బయటకు పంపించారు. దీంతో రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిని తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. #JusticeForRohit పేరుతో రచ్చ రచ్చ చేశారు. చాలామంది రోహిత్ ను సపోర్ట్ చేస్తూ.. బిగ్ బాస్ పై, నాగార్జున పై విమర్శలు చేశారు.
రోహిత్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజిత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'The sun will shine again' (సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు) అంటూ అభిజిత్ ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో రోహిత్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, అభిమానులు మాత్రం దీనిని రోహిత్ రీఎంట్రీకి సంకేతంగా భావిస్తున్నారు. గతంలో అగ్నిపరీక్ష ద్వారా రోహిత్‌ను బిగ్ బాస్‌కు ఎంపిక చేయడంలో అభిజిత్ పాత్ర ఉండటంతో ఈ ట్వీట్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అభిజిత్ తన ట్వీట్ రోహిత్ గురించేనని ఎక్కడా స్పష్టం చేయలేదు. కాబట్టి దీనిని రీఎంట్రీకి అధికారిక సంకేతంగా భావించలేం. కానీ రోహిత్ అభిమానులు మాత్రం ఈ పోస్ట్ కింద రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
రోహిత్ మళ్లీ హౌస్‌లోకి వస్తున్నాడంటూ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో రోహిత్ కళ్లకు గంతలు కట్టి హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు కనిపించింది. దీంతో అతడి రీఎంట్రీ ఖాయమని చాలామంది భావించారు. అంతే కాదు అసలు రోహిత్ ను బయటకు పంపించలేదని.. అతన్ని స్టూడియోలోనే ఉంచి.. కొన్ని పవర్స్ ఇచ్చి హౌస్ లోకి పంపిస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ వీడియో కూడా వైరల్ అవ్వడంతో.. రోహిత్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
అయితే ఈ వీడియో నిజమైనది కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన వీడియోగా అని కొంత మంది అంటున్నారు. అలాగే రోహిత్ ఎలిమినేషన్ సమయంలో అతడి జర్నీ వీడియో (AV) ప్రసారం చేయకపోవడాన్ని కూడా అభిమానులు రీఎంట్రీకి సంకేతంగా భావిస్తున్నారు. కానీ హౌస్‌మేట్స్ నిర్ణయంతో జరిగిన ఎలిమినేషన్‌లో జర్నీ వీడియో చూపించకపోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే జరిగింది.
మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన రోహిత్ తన మేనల్లుడితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా రోజుల తర్వాత మేనల్లుడిని కలిశానంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్‌లోని తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ 'Moving on.. with a heavy heart' అంటూ మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులు అతను బయటకు వచ్చిన తర్వాత తన సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి రీఎంట్రీ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం అందరిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోంది.
రోహిత్ రీఎంట్రీపై అసలు నిజం ఇదే!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రోహిత్ మళ్లీ బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి వస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. అభిజిత్ ట్వీట్, అభిమానుల కామెంట్లు, వైరల్ వీడియోలు మాత్రమే ఈ ప్రచారానికి కారణమయ్యాయి. మరోవైపు రోహిత్ రీఎంట్రీ అవకాశాలు ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తున్నాయి. అభిమానుల ఒత్తిడి, బిగ్ బాస్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రోహిత్ ను హౌస్ లోకి పంపిస్తారన్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.