ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్‌తో `కల్కి2898ఏడీ` మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ, భారీ స్కేల్ ఉన్న మూవీ కూడా ఇదే. అంతేకాదు భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న మూవీ ఇది. ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ గ్లామర్ ని బ్యాలెన్స్ చేయబోతున్నారు. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ లుగా మెరుస్తున్నారు.
దీంతో `కల్కి` మూవీ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కుతుందని చెప్పొచ్చు. ఇది సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు ఆకాశమే హద్దులా మారింది. దీంతో ఇది దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్‌లపై చాలా ప్రెజర్‌ని పెంచుతుంది. కానీ రాజీపడకుండా నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా, కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది.
#Kalki2898AD
అయితే ఈ మూవీకి సంబంధించిన పలు గూస్ బంమ్స్ తెప్పించే విషయాలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `కల్కి` మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారని టీమ్ నుంచి వినిపించే వార్త. `కల్కి` గ్లింప్స్ లోనూ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం దీన్ని మూడు భాగాలుగా తీసుకురాబోతున్నారట. బడ్జెట్, రికవరీ కోసం మాత్రమే కాదు, కథ డిమాండ్ మేరకు కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ మూడు పార్ట్ లుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
మూడు పార్ట్ లకు సంబంధించిన టైటిల్స్ కూడా లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. `కల్కి2898ఏడీ`(కల్కి1)ని ఈ మే 9న విడుదల చేయబోతున్నారు. ఇక `కల్కి3102బీసీ(కల్కి2)` తోపాటు `కల్కి3228బీసీ`(కల్కి 3)గా టైటిల్స్ ఫిక్స్ చేశారట. రెండో పార్ట్ ని 2027లో ప్లాన్ చేస్తున్నారట. 2029 లేదా 30లో మూడో భాగం ఉండే అవకాశాలున్నాయి.
దీంతోపాటు ఇది టైమ్ ట్రావెల్ స్టోరీగా సాగుతుంది. ఫ్యూచర్ నుంచి పాస్ట్ లోకి వెళ్తుందట. ఈ క్రమంలో ప్రభాస్ పాత్రలు కూడా మారుతాయని, ఆయన రూపాలు కూడా మారుతాయని అంటున్నారు. ఇందులో మైథలాజికల్ ఎలిమెంట్లని కూడా జోడిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్రకి పురాణాలతో ముడిపెడుతూ కథ సాగుతుందట. ఈ క్రమంలో ప్రభాస్ మూడు నాలుగు పాత్రల్లో కనిస్తారని, ఆయన దేవుళ్లుగా కనిపిస్తారని తెలుస్తుంది. అందులో భాగంగా డార్లింగ్.. మరోసారి రాముడిగా కనిపించే అవకాశాలున్నట్టు సమాచారం.
మైథలాజికల్ ఎలిమెంట్లు వచ్చినప్పుడు ప్రభాస్ మరోసారి రాముడిగా కనిపించనున్నారట. దీంతోపాటు విష్ణుమూర్తిగా, కృష్ణుడిగా, కల్కి అవతారాల్లో దర్శమిస్తాడని, ఇవి కొన్నిసీన్లుగా అలా వచ్చిపోతాయని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. కేవలం రూమర్‌కే పరిమితమా? లేక నిజం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభాస్ `ఆదిపురుష్`లో రాముడిగా నటించిన విషయం తెలిసిందే. ఇది డిజాస్టర్ అయ్యింది.
ఇక మే 9న మొదటి భాగం రాబోతుంది. దీన్ని ఇంటర్నేషనల్ మూవీగా ప్రమోట్ చేయబోతున్నారట. 25కు పైగా భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకోబోతుంది. నెక్ట్స్ వీక్ ప్రభాస్, కమల్, అమితాబ్‌లతో కీలక సీన్లు చిత్రీకరించబోతున్నారట. మెయిన్ కాస్టింగ్ ఇందులో పాల్గొంటారని తెలుస్తుంది.
ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అనుకున్న డేట్‌కి రిలీజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది యూనిట్. అదే సమయంలో ఈ మూవీ ఈ సమ్మర్ కి సోలోగా వస్తుంది. ఇది కూడా కలిసొచ్చే అంశం. మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో సత్తా చాటుతుంది, ఏ స్థాయిలో కలెక్షన్లని రాబడుతుందో చూడాలి.