Ibomma: రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కి గట్టిగా దెబ్బ పడింది..నాగవంశీ చెప్పింది నిజమే

Published : Apr 03, 2025, 02:06 PM IST

Ibomma: ఒకప్పుడు పైరసీ అంటే టాలీవుడ్ గజగజ వణికిపోయేది. మగధీర, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు రిలీజ్ కి ముందే పైరసీ ప్రభావానికి గురయ్యాయి. అలాంటి సంఘటనలు ఇటీవల తగ్గాయి. అయితే పూర్తిగా పైరసీని నిర్మాతలు అరికట్టలేకున్నారు.

PREV
14
Ibomma: రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కి గట్టిగా దెబ్బ పడింది..నాగవంశీ చెప్పింది నిజమే
Nithiin

Ibomma: ఒకప్పుడు పైరసీ అంటే టాలీవుడ్ గజగజ వణికిపోయేది. మగధీర, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు రిలీజ్ కి ముందే పైరసీ ప్రభావానికి గురయ్యాయి. అలాంటి సంఘటనలు ఇటీవల తగ్గాయి. అయితే పూర్తిగా పైరసీని నిర్మాతలు అరికట్టలేకున్నారు. ఇటీవల పైరసీ ప్రభావం ఎక్కువైంది. టాలీవుడ్ కి ఇది ఊహించని దెబ్బ అని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

24

ఇటీవల విడుదలైన నితిన్ రాబిన్ హుడ్, నార్నె నితిన్ నటించిన మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు ప్రస్తుతం ఐబొమ్మలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి అంటే పైరసీ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మ్యాడ్ స్క్వేర్ చిత్ర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. 

34

కానీ పైరసీ వల్ల ఇప్పుడు ఎక్కువ నష్టపోయేది రాబిన్ హుడ్ చిత్రమే. ఈ చిత్రానికి వసూళ్లు దారుణంగా ఉన్నాయి. నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ దిశగా రాబిన్ హుడ్ పయనిస్తోంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రం కంప్లీట్ గా యూత్ ఫుల్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. మొదటి భాగం హిట్ కావడంతో రెండవ భాగానికి జనాలు ఎగబడ్డారు. 

44
Mad Square movie

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ తర్వాత తెరకెక్కిన రాబిన్ హుడ్ మూవీ సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. యాక్షన్, కామెడీ నేపథ్యంలో వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయినా మిగిలిన చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ చిత్రం ఐబొమ్మలో కూడా లీక్ అయింది. 

Read more Photos on
click me!

Recommended Stories