Hyper Aadi, Sowmya rao
బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ కమెడియన్ గా హైపర్ ఆది పాపులర్ అయ్యారు. సినిమాల్లో కూడా హైపర్ ఆది రాణిస్తున్నారు. హైపర్ ఆది మొదలెడితే కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తాయి. అయితే కొన్ని సార్లు డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల హైపర్ ఆది ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
గతంలో రష్మీ, అనసూయ లాంటి యాంకర్స్ పై హైపర్ ఆది కామెంట్స్ ఎంతలా వివాదం అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ యాంకర్ సౌమ్య రావుతో కూడా హైపర్ ఆది చిలిపిగా ప్రవర్తిస్తూ కొన్ని సార్లు అసభ్యకరమైన కామెంట్స్ తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు.
సౌమ్య రావు కూడా హైపర్ ఆదితో క్లోజ్ కనిపించింది. బుల్లితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, అతడితో కనెక్షన్ గురించి సౌమ్య రావు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. హైపర్ ఆదితో ఏంటి మీకు కనెక్షన్ అనే యాంకర్ అడగగా.. సౌమ్య రావు క్లారిటీ ఇచ్చింది.
Sowmya Rao
హైపర్ ఆదితో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. కొత్త అమ్మాయి ఎవరు వచ్చిన హైపర్ ఆది అలాగే బిహేవ్ చేస్తాడు. సులభంగా పులిహోర కలుపుతాడు. అంతే కానీ అతడితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని సౌమ్య రావు పేర్కొంది. అమ్మాయిలపై సెటైర్లు వేయడం, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం బేసిక్ టాపిక్ గా హైపర్ ఆది పెట్టుకున్నాడు అని సౌమ్య రావు అన్నారు.