నిన్ను ప్రతి రోజూ మిస్ అవుతున్నా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు రియా చక్రవర్తి నివాళి..

Published : Jun 14, 2022, 02:26 PM ISTUpdated : Jun 14, 2022, 02:29 PM IST

బాలీవుడ్ దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకొని నేటికి రెండేండ్లు పూర్తయ్యింది. ఆయన వర్థంతి సందర్భంగా అభిమానులు, సినీ తారలు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా నటి రియా చక్రవర్తి కూడా నివాళి అర్పించింది.  

PREV
16
నిన్ను ప్రతి రోజూ మిస్ అవుతున్నా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు రియా చక్రవర్తి నివాళి..

సరిగ్గా రెండేండ్ల కింద ఇదే రోజు చిత్ర పరిశ్రమను కుదిపేసే వార్త వినాల్సి వచ్చింది. అదే బాలీవుడ్ నెంబర్ వన్ యంగ్ అండ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) సూసైడ్ వార్త. జూన్ 14, 2020న సుశాంత్ ముంబయిలోని బంద్రాలో గల ఆయన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని ఇప్పటికీ అభిమానులు, సినీ లోకం మరిచిపోలేకపోతోంది.  

26

అతి తక్కువ వయస్సులో.. 34 ఏండ్లకే యంగ్ స్టార్ ప్రాణాలు తీసుకోవడం పట్ల అటు చిత్ర పరిశ్రమ.. ఇటు ఫ్యాన్స్ అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్ది రోజుల పాటు సుశాంత్ లేరనే చేధు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయితే ఈ రోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రెండో వర్థంతి సందర్భంగా ఇప్పటికే ఆయన సోదరి శ్వేతా సింగ్ హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది. తన సోదరుడు సుశాంత్ తో దిగిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నివాళి అర్పించింది. అభిమానులు, నెటిజన్లు  కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు.  
 

36

తాజాగా సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) కూడా నివాళి అర్పించింది. సుశాంత్ సింగ్ ను ఇంకా మరిచిపోలేకపోతున్నట్టుగా భావోద్వేగంగా స్పందించింది. ఈ సందర్భంగా  ఇన్ స్టా గ్రామ్ ద్వారా సుశాంత్ తో గడిపిన పలు ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించింది. 
 

46

సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి కలిసి అవుటింగ్ కు వెళ్లినప్పటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఒక ఫొటోలో సుశాంత్ రియా ఒడిలో పడుకొని నవ్వుతూ కనిపిస్తున్నాడు. రియా, సుశాంత్ బుగ్గ మీద ముద్దుపెడుతున్నటు వంటి మరో ఫొటోను పంచుకుంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ గా క్యాప్షన్ ఇచ్చిందీ రియా. ‘ప్రతి రోజూ నిన్ను కోల్పోతున్నాను’ అంటూ సుశాంత్ గురించి చెప్పింది. దీంతో ఇప్పటికీ రియా సుశాంత్ జ్ఞాపకాల్లోనే ఉందని తెలుస్తోంది. ఈమె పోస్ట్ కు నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

56

సుశాంత్ సూసైడ్ తర్వాత రియాను మనీలాండరింగ్ మరియు SSR ఆత్మహత్యకు సహకరించిందనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డ్రగ్స్ సంబంధిత కేసు పట్ల రియా మరియు ఆమె సోదరుడు షోక్ చక్రవర్తిని అరెస్టు చేశారు. 
 

66

ఆ తర్వాత రియా ముంబైలోని బైకుల్లా జైలులో ఒక నెల శిక్షను అనుభవించింది. మూడు నెలల తర్వాత ఆమె సోదరుడు షోక్‌కి బెయిల్ వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో, సీజ్ చేసిన ఆమె బ్యాంక్ ఖాతాలు మరియు గాడ్జెట్‌లకు యాక్సెస్ మంజూరు అయ్యింది. 

click me!

Recommended Stories