తండ్రి జ్ఞాపకాలకు దూరంగా వెళ్తున్న జబర్దస్త్ బ్యూటీ.. ఆయన చివరి కోరిక కోసం ఇష్టమైనవన్నీ వదులుకుంటూ ఎమోషనల్‌

Published : May 02, 2023, 05:29 PM ISTUpdated : May 02, 2023, 07:06 PM IST

జబర్దస్త్‌ కమెడియన్‌ రీతూ చౌదరి ఇటీవలే తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతుంది. దీంతో తన నాన్న జ్ఞాపకాలకు దూరంగా వెళ్తుందట. ఈ మేరకు ఆమె ఎమోషనల్ వీడియోని పంచుకుంది.  

PREV
17
తండ్రి జ్ఞాపకాలకు దూరంగా వెళ్తున్న జబర్దస్త్ బ్యూటీ.. ఆయన చివరి కోరిక కోసం ఇష్టమైనవన్నీ వదులుకుంటూ ఎమోషనల్‌

`సరిగమప`లో సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకుని ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ అయ్యింది హాట్‌ బ్యూటీ రీతూ చౌదరీ. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి `సరిగమప` లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ ఒక్క సన్నివేశంతో ఆమె ఓవర్‌ నైట్ లో స్టార్‌ అయిపోయింది. అంతకు ముందు ఎన్ని షోస్‌ చేసినా, వీడియోస్‌ చేసినా రాని పేరు, క్రేజ్‌ యశస్వి కారణంగా వచ్చింది. బుల్లితెర స్టార్‌ అయిపోయింది. 
 

27

ఆ తర్వాత `జబర్దస్త్` షోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్‌గా మెప్పించింది. అందం, హాట్‌నెస్‌ మేళవించిన ఈ హాట్‌ బ్యూటీ మొదట కామెడీ చేయడంలో ఇబ్బంది పడింది. డైలాగులు కూడా సరిగా చెప్పలేక విమర్శలెదుర్కొంది. ఆ తర్వాత సెట్‌ అయిబాగానే అలరించింది. కమెడియన్‌గా నవ్వులు పూయించింది. దీనికితోడు తన అసెట్‌ అయిన అందంతో మరింతగా ఆకట్టుకుంటుంది. అలరించింది. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ ని కూడా వదిలేసింది. ఇన్‌స్టా రీల్స్, ఇతర టీవీ షోస్‌, షార్ట్ ఫిల్స్, యాడ్స్ చేస్తూ రాణిస్తుంది. అందాల విందుతో మరింతగా టెంప్ట్ చేస్తుంది.
 

37

ఇదిలా ఉంటే ఇటీవల అనూహ్యంగా తన తండ్రిని కోల్పోయింది రీతూ చౌదరి. హార్ట్ ఎటాక్‌తో తన ఫాదర్ చనిపోయినట్టు పేర్కొంది. ఈ సందర్బంగా తండ్రిని ఉద్దేశించి ఓ ఎమోషనల్‌ నోట్‌ని కూడా పంచుకుంది. నాన్నతో దిగిన ఫోటోని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. నువ్వు లేకపోతే నేను ఉండలేనని వాపోయింది. `ఈ కూతురి వద్దకు తిరిగి రా నాన్నా` అంటూ ఆమె పంచుకున్న నోట్‌ కన్నీళ్లు పెట్టించింది. ఇదిలా ఉంటే ఇప్పటికీ తండ్రి జ్ఞాపకాలను మరువలేకపోతుందట. నాన్నకి గారాల పట్టిగా పెరిగిన రీతూ చౌదరికి నాన్నంటే ప్రాణం. దీంతో ఆయన్ని మర్చిపోలేకపోతుంది. ఆ బాధ నుంచి బయటపడలేకపోతుంది. 
 

47

ఈ నేపథ్యంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది రీతూ చౌదరి. నాన్నతోపాటు తాము కలిసున్న ఇంటి(రెంట్‌ హౌజ్‌)ని వదిలేస్తున్నారు. తండ్రి జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఫ్లాట్ ని ఖాళీ చేస్తున్నట్టు తెలిపింది రీతూ చౌదరి. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో ద్వారా వెల్లడించింది. నాన్నకి గుర్తుగా ఇచ్చిన పిల్లోని, రూమ్‌ విశేషాలను పంచుకుంది. అక్కడ ఉంటే నాన్నే గుర్తొస్తున్నారని, ఏం చేయలేకపోతున్నామని, ఆ బాధ తమని వెంటాడుతుందని తెలిపింది రీతూ చౌదరి. అందుకే ఖాళీ చేస్తున్నామని చెప్పింది. 

57

పిల్లోపై నాన్న, తాను ఉన్న ప్రింటెడ్‌ కవర్‌ని చూపించి ఎమోషన్‌ అయ్యింది. ఆయన షర్ట్స్ ని కూడా ఇంకా అలానే దాచుకున్న రీతూ చౌదరి, వాటిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న తాను కలిసి ఆడుకునేవాళ్లమని, కొట్టుకునే వాళ్లమని, కబుర్లు చెప్పుకునే వాళ్లమని, పైన మార్నింగ్‌, సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేసేవాళ్లమని, నడుస్తూ ఫుడ్‌ తినేవాళ్లమని, తమకి ఎన్నో మెమరీస్‌ ఉండిపోయాయని తెలిపింది రీతూ. వాటన్నింటిని గుర్తుం చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. 

67

లైఫ్‌లో ముందుకు సాగాలంటే గతాన్ని మర్చిపోవాలి. అందుకే తండ్రి జ్ఞాపకాలకు దూరం కావాలనుకుంటున్నట్టు తెలిపింది. ఇంటిని ఖాళీ చేసుకున్నామని చెప్పింది. ఈ సందర్బంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది రీతూ. తాను పుట్టినప్పట్నుంచి తాను వేసుకున్న దుస్తులను విరాళంగా ఇవ్వాలనుకుందట. తనకు డ్రెస్‌ల పిచ్చి అని, ఏ డ్రెస్‌ అయినా రెండు మూడు సార్లకి మించి వేయనని తెలిపింది. దీంతో అవి ఇప్పటికీ కొత్తగా, చాలా బాగా ఉన్నాయని చెప్పింది. 

77

అయితే అవసరంలో ఉన్నవాళ్లకి, ఆర్ఫనేజ్‌ వాళ్లకి తన దుస్తులు దానం చేయాలనుకుంటుందట. తన బట్టలంటే తనకు ఎంతో ఇష్టమట. అందుకే చిన్నప్పట్నుంచి తానువేసుకున్న బట్టలను పడేయకుండా, ఎవరికీ ఇవ్వకుండా అలానే దాచుకుందట. ఆయా దుస్తులను ఇప్పుడు దానం చేయాలనుకుంటున్నట్టు చెప్పింది రీతూ. అయితే ఇలా దానం చేయాలనేది తన తండ్రి కోరిక అట. ఇష్టమైనవి ఇవ్వమని, పది మందికి మంచి చేయమని ఆయన కోరాడట. అందుకే తన బట్టలను దానం చేస్తున్నట్టు చెప్పింది రీతూ చౌదరి. ప్రస్తుతం ఆమె పంచుకున్న వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories