Rithu Chowdary మ్యారేజ్‌ లైఫ్‌ పెటాకులు కావడం వెనుకున్న కారణం ఇదే.. బిగ్‌ బాస్‌ షో ఇంత పని చేసిందా?

Published : Jan 05, 2026, 04:59 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9తో రీతూ చౌదరీ బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఉన్న తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసుకుంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ విషయంలో సక్సెస్‌ అయ్యింది రీతూ. 

PREV
15
బిగ్‌ బాస్‌ షోలో రీతూ చౌదరీ రచ్చ వేరే లెవల్‌

రీతూ చౌదరీ ఇటీవల బిగ్‌ బాస్‌ షోలో సందడి చేసింది. ఆమె స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉంటూ అందరిని ఆకట్టుకుంది. డీమాన్‌ పవన్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇద్దరు రియల్‌ లవర్స్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. డీమాన్‌ పవన్‌ తనకు చాలా ఇంపార్టెంట్‌ అని ప్రకటించింది రీతూ. పవన్‌ సైతం రీతూ గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు ఇటీవల ఆదివారం స్టార్ మా పరివార్‌లో వీరు పాల్గొన్నారు. ఇందులో పవన్‌కి ముద్దు కూడా పెట్టింది రీతూ. బిగ్‌ బాస్‌ షోలో అది సాధ్యం కాలేదు, ఆ కోరికని ఇందులో తీర్చుకుంది.

25
రూ. 700 ల్యాండ్‌ స్కామ్‌లో రీతూ చౌదరీ పేరు

అయితే అంతకు ముందు రీతూ చౌదరీ గురించిన చాలా విషయాలు మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆమె చుట్టూ  పెద్ద వివాదం నడిచింది. శ్రీకాంత్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని రీతూ చౌదరీ పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తనే ఒప్పుకుంది. ఏడెనిమిది నెలలు కలిసి సహజీవనం చేశారు. గోవాకి మూడు నాలుగు సార్లు వెళ్లారు కూడా. అయితే వీరికి సంబంధించిన రూ.700కోట్ల ల్యాండ్‌ స్కామ్‌ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత శ్రీకాంత్‌ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఆయన్నుంచి దూరంగా ఉంది రీతూ. అనంతరం ఆమె బిగ్‌ బాస్‌ షోకి వెళ్లింది.

35
వరుస వివాదాలకు కేరాఫ్‌గా రీతూ చౌదరీ

బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాక కూడా ఆమెపై అనేక వార్తలొచ్చాయి. హీరో ధర్మ మహేష్‌తో రిలేషన్‌ కి సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ధర్మ మహేష్‌ భార్య ఆరోపణలు చేసింది. ఇవన్నీ రీతూని వార్తల్లో నిలిపాయి. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. అయితే తాజాగా రీతూకి సంబంధించిన పాత ఇంటర్వ్యూలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇందులో ఆమె పెళ్లి విషయానికి సంబంధించిన విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. తన ఫాదర్‌ ఉన్నప్పుడే శ్రీకాంత్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పింది. రిజిస్టేషన్‌ మ్యారేజ్‌ కూడా చేసుకున్నట్టు తెలిపింది. అనంతరం ఆరేడు నెలలు కలిసి ఉన్నారట.

45
పెళ్లి, విడాలకుపై రీతూ చౌదరీ క్లారిటీ

ల్యాండ్‌ స్కామ్‌ విషయం బయటకు వచ్చాక శ్రీకాంత్‌తోపాటు రీతూపై కూడా ఎసీబీ దాడులు జరిగాయి. దీంతో రీతూ మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీసుకెళ్లిపోయారట. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్నట్టుగా శ్రీకాంత్‌ చెప్పాడని, కానీ అసలు విషయం అది కాదని, తమ మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగాయని తెలిపింది. కొట్టుకునే స్థాయికి వెళ్లినట్టుగా ఆమె చెప్పకనే చెప్పింది. మహా టీవీలో రీతూ మాట్లాడుతూ  ఈ విషయాలను పంచుకుంది. చాలా రోజులుగా గొడవలు జరిగాయట. ఈ క్రమంలో కొట్టుకున్నట్టుగానూ రీతూ చెప్పింది. కాకపోతే దాన్ని డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. మొదట విడాకులు వెళితే తాను ఒప్పుకోలేదట. ఆ తర్వాత అతను ఒప్పుకోవడం లేదట. ఇప్పుడు తమ విడాకుల విషయం కోర్ట్ లో ఉందని చెప్పింది రీతూ. ఏడాదిన్నరగా విడాకుల మ్యాటర్‌ కోర్ట్ లోనే ఉందని, డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పింది.

55
బిగ్‌ బాస్‌ షోలో రీతూ సక్సెస్‌, ఎందుకంటే?

అయితే ఈ విషయంలో తాను మోసపోయినట్టు చెప్పింది. తనకు ల్యాండ్‌ స్కామ్‌ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, తనకు తెలియదని చెప్పింది.  తన పేరుతో రాయించిన ల్యాండ్‌ విలువ ఎంత ఉంటుందో కూడా తెలియదని, సైన్‌ పెట్టమంటే పెట్టినట్టు, రూ.700కోట్ల స్కామ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. 

అయితే బిగ్‌ బాస్‌ షోకి వచ్చాక కూడా రీతూపై ఉన్న ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు ఆమెపై చాలా నెగటివిటీ ఉండేది. ఈ స్కామ్‌ బయటపడ్డాక మరింత నెగటివిటీ వచ్చింది. కానీ బిగ్‌ బాస్‌ షో ఆమె ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. రీతూ ఇన్నోసెంట్‌ అనేది బాగా ప్రొజెక్ట్ అయ్యింది. అయితే షోలోకి వెళ్లే ముందు కూడా తన పేరు వనం దివ్య కాదు అని, ఆ బ్యాడ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడేందుకే వెళ్తున్నట్టుగా చెప్పింది. అంతిమంగా ఆ విషయంలో సక్సెస్‌ అయ్యింది రీతూ. ఇమేజ్‌ డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేసుకుంది. మరి రియల్ వివాదాల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories