దేవాయని ప్లాన్ సక్సెస్.. వసు, జగతిపై రిషి శాడిజం.. అసలు కథ ఇప్పుడే ప్రారంభం

First Published Oct 19, 2021, 2:37 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ (Rating) లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ (Rating) లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం.
 

కాలేజ్ లో మిషన్ ఎడ్యుకేషన్ భాగంలో స్ఫూర్తి ప్రదాత కార్యక్రమంలో రిషి కి (Rishi) ఇంటర్వ్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి రిషి వద్దన్నందుకు జగతి (Jagathi) రాలేకపోతుంది. జగతి మేడం రాలేనందుకు వసు వెనుకకి వచ్చేస్తుంది.
 

 ఇక ఆ కార్యక్రమంలో మహేంద్ర వర్మ, ఫణీంద్ర వర్మ తో పాటు స్టూడెంట్స్ మొత్తం పాల్గొనగా ఈ కార్యక్రమంను జగతి, వసు, దేవయాని (Jagathi, vasu, Devayani) తమ ఫోన్ లలో లైవ్ వీడియో చూస్తుంటారు. రిషి (Rishi) ఇంటర్వ్యూ చూస్తున్న వీళ్లంతా సంతోషంలో కనిపిస్తారు.
 

ఇంటర్వ్యూలో రిషి (Rishi) కాలేజీ గురించి, మిషన్ ఎడ్యుకేషన్ గురించి అద్భుతంగా తెలుపుతాడు. ఇదంతా తన స్టూడెంట్స్ సపోర్టుతో జరిగిందని తెలుపుతాడు. ఇక తన నాన్న, పెద్దనాన్న (Father's) గురించి కూడా చెబుతాడు.
 

ఇక ఇంటర్వ్యూవర్ మిషన్ ఎడ్యుకేషన్ ఆలోచన ఎవరిది అని ప్రశ్నించగా జగతి (Jagathi) మేడమ్ అని చెప్పేసరికి అందరూ సంతోష పడతారు. మరోవైపు దేవయాని కోపంతో రగిలిపోతుంది. తన స్టూడెంట్ వసుధారా (Vasudhara) కూడా సపోర్ట్ అని చెబుతాడు.
 

జగతి, వసుల (Jagathi, Vasu) పేరు వినేసరికి దేవయాని కోపంతో మాట్లాడుతుంది. ధరణి (Dharani) పై కాస్త మండిపడుతుంది. ధరణి కూడా కాస్త సరదా పంచులు వేస్తున్నట్లు మాట్లాడుతుంది.  ఏది జరగకూడదో అదే జరిగింది అంటూ తనలో తాను మండిపడుతుంది.
 

జగతి, వసు (Jagathi, Vasu) లు ఒకరికొకరు ఎక్కడికి వెళ్లావని మాట్లాడుతుండగా రిషి (Rishi) వచ్చి వారిపై కాస్త రివేంజ్ తీర్చుకుంటాడు. ఈ క్రెడిట్ మొత్తం మీ ఇద్దరిదీ అంటూ పొగిడినట్లే పొగిడి ప్రతీకారం తీర్చుకుంటాడు.
 

అదే సమయంలో అక్కడికి మహేంద్ర వర్మ (Mahendra Varma) రావడంతో ఆయనకు సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవయాని.. (Devayani) రిషి కోసం స్వీట్లు చేయమని ధరణి తో చెబుతుంది. తరువాయి భాగంలో వసు సారీ పురాణం వదులుతుంది.

click me!