Guppedantha Manasu: జగతి, వసుల మధ్య దూరం కోరుకుంటున్న రిషి.. ఏకంగా ఆ నిర్ణయంతో ట్విస్ట్?

Navya G   | Asianet News
Published : Dec 23, 2021, 02:16 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Guppedantha Manasu: జగతి, వసుల మధ్య దూరం కోరుకుంటున్న రిషి.. ఏకంగా ఆ నిర్ణయంతో ట్విస్ట్?

రిషి (Rishi) వసుధారను కారులో ఒక చోటికి తీసుకొని వెళ్లి తనతో తన పెద్దమ్మ విషయంలో చాలా పెద్ద తప్పు చేసావని అంటాడు. దాంతో.. వసు అసలు జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే రిషి అసలు చెప్పనివ్వడు. ఎలాగైనా సారీ చెప్పాలని గట్టిగా అంటాడు. కానీ వసు (Vasu) తాను తప్పు చేయకుండా ఎందుకు చెప్పాలని     మొండి ధైర్యంగా ఉంటుంది.
 

26

ఇక మరోవైపు మహేంద్ర (Mahendra), జగతిలు కలిసి రిషి గురించి ఆలోచిస్తూ.. తన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. తన ప్రవర్తన రోజు రోజుకి అర్ధంకాకుండా పోతుందని జగతి (Jagathi) బాధపడుతుంది. ఇక మహేంద్రవర్మ కూడా రిషి గురించి తనకు ఏమీ అర్థం కావడం లేదని అంటాడు.  ఉదయాన్నే ధరణి తో మాట్లాడేటప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నాడని చెబుతాడు.
 

36

దీంతో ఒకసారి వసును (Vasu) కలిస్తే అంతా తెలుస్తుందని అనుకుంటారు. ఇక అప్పటి వరకు మంచం పైన హాయ్ గా ఆలోచిస్తూ పడుకున్న దేవయాని రిషి వస్తున్న విషయాన్ని గమనించి. అయ్యో నొప్పి అని అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇక రిషి (Rishi) లోపలకు వచ్చి తన ఆరోగ్యం గురించి అడుగుతాడు.
 

46

ఇక దేవయాని (Devayani) కాసేపు మాట్లాడుతూ మధ్యలో వసు గురించి టాపిక్ తీస్తూ మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక రిషి కూడా అదే ఆలోచనలో పడుతూ.. ముందు మీరు త్వరగా కోలుకోవాలి పెద్దమ్మ అని చెబుతాడు. ఇక రిషి (Rishi) కాలేజ్ లో క్లాస్ కు ఎంట్రీ అవుతాడు. అదే సమయంలో ఆలస్యం గా వచ్చిన వసును చూసి ఎందుకు ఆలస్యం అయ్యిందని అడుగుతాడు.
 

56

మళ్లీ తన పేరు బయటపెడుతుందేమో అనుకొని లోపలికి రమ్మంటాడు. ఇక వసు (Vasu) నోట్ బుక్ ను అడగటంతో బుక్ తీస్తున్న సమయంలో గోళీలు కిందపడుతాయి. ఇక వసు వాటిని చూసుకోకుండా నడుస్తూ కింద పడిపోతుంది. దాంతో రిషి చేతిని అందించి తనను లేపుతాడు. ఆ తరువాత జగతి రిషి కాబిన్ వద్ద రిషి (Rishi) కోసం ఎదురు చూస్తుంది.
 

66

అంతలోనే రిషి రావడంతో ఇద్దరు వారు చేసే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇక జగతి (Jagathi) వెళిపోతుండగా తనను ఆపి మనసులో మాటను బయట పెడతాడు. తన ఇంట్లో నుంచి వసును బయటకు పంపించమని చెబుతాడు. దీంతో జగతి చాలా బాధపడుతుంది. అప్పుడే ఆ మాటను విన్న వసు (Vasu) ఒకేసారి షాక్ అవుతూ చూస్తుంది. మొత్తానికి వీరిద్దరిని దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు రిషి.

click me!

Recommended Stories