Guppedantha Manasu: శోకసంద్రంలో జగతి కుటుంబం.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న రిషి!

Published : Oct 04, 2023, 08:11 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్యని దూరం చేసుకుని కుమిలిపోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: శోకసంద్రంలో జగతి కుటుంబం.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న రిషి!

  ఎపిసోడ్ ప్రారంభంలో జగతి చనిపోయిందని నర్స్ చెప్తుంది. ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అవుతారు. మహేంద్ర అయితే ఆ మాట విని తట్టుకోలేక గట్టిగా అరిచేస్తాడు. రిషి అయితే మా అమ్మ చనిపోలేదు, తను మనతోనే ఉంది లెగమ్మా అంటూ ఆమె మీద పడి ఏడుస్తాడు. అయితే ఇదంతా చూస్తున్న దేవయాని, శైలేంద్రలు మాత్రం తమ ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు ఆనందపడతారు. నిజానికి జ్యూస్ లో టాబ్లెట్ కలిపి నర్స్ చేత జగతికి ఇవ్వమని  శైలేంద్ర తల్లికి చెప్తాడు.
 

27

 కొడుకు చెప్పినట్లే చేస్తుంది దేవయాని. ఇదంతా తలుచుకొని గర్వంగా నవ్వుకుంటారు తల్లీ, కొడుకులు. ఆ తరువాత జగతిని కిందన పడుకోబెడతారు. అది చూసిన మహేంద్ర కుమిలిపోతాడు. రిషి కూడా తల్లి పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఫణీంద్ర దేవయాని  దగ్గరికి వెళ్లి రిషి తో మిగిలిన కార్యక్రమాలు జరిపించాలని చెప్పు అంటాడు. అప్పుడు దేవయాని అమాయకంగా మొహం పెట్టి ఏమని చెప్పమంటారు, రిషి ని చూస్తే గొంతు పెగలడం లేదు అంటుంది.
 

37

 అప్పుడు చక్రపాణి కూతురుతో మిగిలిన కార్యక్రమాలు జరిపించాలమ్మ.. ఆ విషయం అల్లుడుతో చెప్పు అంటాడు. సార్ బయట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక కొడుకుగా మీరే ఆమెని సాగనంపాలి, ఆ కార్యక్రమాలన్నీ మీరే చేయాలి అంటుంది వసుధార. లేదు, అమ్మ చనిపోలేదు, నువ్వే చెప్పావు కదా నేను అమ్మా అని పిలిస్తే ఆ పిలుపే ఆమెకి ఊపిరి పోస్తుందని. నేను పిలుస్తున్నాను లేవమని చెప్పు అంటూ ఎమోషనల్ అవుతాడు రిషి.
 

47

ఆమె మీ పిలుపు అందుకోలేనంత దూరానికి వెళ్లిపోయారు అంటుంది వసుధార. అప్పుడు ఫణీంద్ర అక్కడున్న వాళ్ళందరినీ జగతిని బయటికి తీసుకు వెళ్ళటం కోసం పిలుస్తాడు. వాళ్ళందరూ వచ్చి జగతిని అక్కడినుంచి తీయటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రిషి వద్దు.. మా అమ్మని నేనే తీసుకు వెళ్తాను అని తను ఒక్కడే జగతిని బయటకు తీసుకువెళ్తాడు. అప్పుడు మహేంద్ర బాగా ఎమోషనల్ అయిపోతాడు.
 

57

 అన్నయ్య, తీసుకువెళ్లొద్దు అని చెప్పు, జగతిని తీసుకువెళ్లి పోతుంటే నేను భరించలేకపోతున్నాను, తను లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తాడు. తమ్ముడికి ధైర్యం చెప్తాడు ఫణీంద్ర. జగతిని కుర్చీలో కూర్చోబెట్టి ఆడవాళ్ళందరూ పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు. అయితే ఆ పక్కగా కూర్చున్న రిషి బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జగతి ఆత్మ అతని దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు నీ కోపంలో నీ పంతంలో ప్రేమ ఉంది. అలాగే నా నిస్సహాయతలో, నా పనుల వెనక కూడా ప్రేమ ఉంది. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకొని ఆఖరి నిమిషంలో అమ్మ అని పిలిచావు.
 

67

 నాకు అంతే చాలు అంటూ కొడుకుని ఊరడిస్తుంది. అప్పుడు తల్లిని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు రిషి. అయితే అక్కడ ఉన్నది వసుధార. సార్..అంటూ గట్టిగా పిలవటంతో స్పృహలోకి వచ్చిన రిషి ఇలా జరిగిందేంటి వసుధార, అమ్మ నన్ను ఎంతగా ప్రేమించింది కానీ నేను తనని అంతగా బాధపెట్టాను. ఇక తనకి నా బాధ ఉండదు అంతా ప్రశాంతతే అంటాడు రిషి. బాధపడకండి సార్ ఇందులో మీ తప్పేముంది అంతా విధిరాత అంటుంది వసుధార.ఆ దేవుడు నా విధిరాతని  ఇలా ఎందుకు రాసాడు వసుధార..
 

77

 ఇన్నాళ్లు అమ్మ ప్రేమ దక్కలేదు, ఇప్పుడు అమ్మనే లేకుండా చేశాడు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇక నాకు కన్నీళ్లు తప్ప ఇంకేమి మిగిలింది అంటూ తల్లి దగ్గరికి వెళ్లి ఆమె మీద పడి  ఏడుస్తాడు. ఆ తర్వాత జగతి ఆఖరి ప్రయాణంకోసం కార్యక్రమాలు మొదలవుతాయి.అయితే శైలేంద్ర జగతి పాడె ని మోయటానికి ప్రయత్నిస్తాడు. కానీ మహేంద్ర అతనిని పక్కకి నెట్టేసి తానే పాడెని మోస్తాడు.ఇక జగతి ఆఖరి ప్రయాణం మొదలవుతుంది. కన్నీటితో కుటుంబ సభ్యులందరూ ఆమెని సాగనంపుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories