ఆ హీరోయిన్ ప్రేమలో రామ్ పోతినేని? త్వరలో పెళ్లి!

First Published | Oct 4, 2023, 7:03 AM IST

హీరో రామ్ ప్రేమలో పడ్డారంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. సదరు హీరోయిన్ ని రామ్ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. 
 

రామ్ పోతినేని పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అతడి కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. టైర్ టు హీరోల జాబితాలో చోటు దక్కించుకున్న రామ్ అప్పుడప్పుడూ విజయాలు అందుకుంటున్నాడు. పరాజయాల్లో ఉన్న రామ్ కి దర్శకుడు పూరి జగన్నాధ్ బ్రేక్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం అందుకుంది. 

అనంతరం చేసిన రెడ్, వారియర్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తాజాగా స్కంద చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన స్కంద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ ఓ మోస్తరుగా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలైనా ఇతర భాషల్లో పట్టించుకోలేదు. 


దర్శకుడు బోయపాటి శ్రీను రాసుకున్న సీన్స్, ఫైట్స్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం సెన్స్ లెస్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 6వ రోజు స్కంద బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అనిపిస్తుంది. 
 

కాగా హిట్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దిగే అవకాశం కలదు. పూరి జగన్నాధ్ అయినా హిట్ ఇస్తాడని ఆశతో ఉన్నాడు. 
 

hello guru premakosame


ఇదిలా ఉంటే రామ్ పై ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఆయన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని ప్రేమిస్తున్నాడట. వీరిద్దరూ కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారట. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

రామ్ పోతినేని-అనుపమ కలిసి ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఈ మలయాళీ ముద్దుగుమ్మ రామ్ పోతినేని భార్య కాబోతుందని వినికిడి. మరి ఈ పుకార్లపై రామ్ స్పందిస్తారేమో చూడాలి... 

Latest Videos

click me!