ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి,వసు ఉన్న కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వసు, "నాకు ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వడం అలవాటు లేదు కానీ ఒక విషయం వినండి సార్. చిన్నప్పటినుంచి నా గోల్ కి, నేనేం చేయాలో నాకు తెలుసు .నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది. ఒక వేళ నేను అది సాధించిన, సాధించకపోయినా నాకు నచ్చింది చేశాను అని సంతృప్తి ఉంటాది, కానీ మీరు సాక్షిని పెళ్లి చేసుకోవడం అనేది మీకు నచ్చనిది.అయినా మీరు ఎందుకు ఈ పని చేశారో నాకు అయితే అర్థం కావట్లేదు?" అని అంటుంది వసు.