బాధలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన రిషి.. వసుకి రింగ్ గిఫ్ట్ ఇచ్చిన జగతి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 28, 2021, 11:55 AM ISTUpdated : Oct 28, 2021, 11:58 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
బాధలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన రిషి.. వసుకి రింగ్ గిఫ్ట్ ఇచ్చిన జగతి!

రిషిని (Rishi) వసు తిడుతుండగా అంతలోనే జగతి (Jagathi) రావడంతో స్టూడెంట్స్ కి కొన్ని మంచి సలహాలు ఇవ్వండి మేడం అంటూ కౌంటర్ ఇచ్చి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఏం జరిగిందని జగతి అడగటంతో వసు ఏం అర్థం కాలేదు అన్నట్లుగా సమాధానం ఇస్తుంది.
 

26

మరోవైపు కాలేజీలో మహేంద్ర వర్మ (Mahindra) ఎంగేజ్మెంట్ కి కావాల్సిన వస్తువులకు లిస్టు రాస్తూ ఉంటాడు. ఇక రిషి వచ్చి శిరీష్, వసు లకు హెల్ప్ చేస్తున్నాడు అని కోపంతో కాస్త వెటకారంగా మాట్లాడుతాడు. ఇక రిషి (Rishi) ఇప్పటికి కూడా ఓపెన్ అవ్వట్లేదు అని.. మహేంద్రవర్మ మనసులో అనుకుంటాడు.
 

36

అప్పుడే జగతి (Jagathi) లోపలకి రావడంతో రిషి ఓ డైలాగ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక జగతి మహేంద్రవర్మ తో ఏం జరిగిందని అడగటంతో మహేంద్ర వర్మ అసలు విషయం చెప్పకుండా అర్థమయ్యేలా వివరిస్తాడు. ఏం చేసినా రిషికి (Rishi) ఏం జరగద్దు అన్నట్లుగా జగతి మాట్లాడుతుంది.
 

46

ఇక రిషి (Rishi)  క్లాస్ లో స్లిప్ టెస్ట్ పెట్టగా వసు ని చూసి శిరీష్ (Sirish) మాట్లాడిన మాటలను తలుచుకుంటాడు. వసు కూడా రిషి తనను తిట్టిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వసు టెస్ట్ రాస్తుంటే పెన్ రాయకపోవడం తో రిషి తనకు పెన్ ఇస్తాడు. సర్ బయట ఎలా ఉన్నా క్లాసులో బాగా ఉంటాడని అనుకుంటుంది.
 

56

ఎగ్జామ్స్ అయ్యాక రిషికి (Rishi) ఆ పెన్ ఇస్తూ మీ వస్తువులు మీ దగ్గరే ఉండాలని అంటారు కదా సార్ అందుకే ఇచ్చాను అని అంటుంది. ఇక వసు నిజం చెబుతాదేమో అని బయటికి తీసుకెళ్తాడు. కానీ వసు (Vasu) చెప్పకపోయేసరికి తానే శిరీష్ చెప్పాడని ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడతాడు.
 

66

వసు (Vasu) మాటలకు రిషి కాస్త బాధతో ఫీల్ అవ్వగా ఆ సమయంలో రిషి ఫేస్ మాత్రం బాగా ఎమోషనల్ గా అనిపించింది. జగతి, వసు లు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా వసుకి రింగ్ కనిపించటంతో రింగ్ తీసుకోమని జగతి (Jagathi) ప్రేమగా బహుమతిగా ఇస్తుంది. ఇక తరువాయి భాగంలో రిషికి ఎంగేజ్మెంట్ కు వెళ్లడం ఇష్టం లేక గుండె భారంతో బయటికి వెళ్ళిపోతాడు.

click me!

Recommended Stories