మరొకవైపు వసుధార రిషి కార్లో వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత దేవయాని మహేంద్ర మీద కోపడుతూ రిషి వెళ్తున్నప్పుడు నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా ఎలా వెళ్ళను ఇస్తావు అని అంటుంది. అప్పుడు జగతి, రిషి వెళ్లాలనుకున్నాడు మా పర్మిషన్ తీసుకోలేదు వెళుతున్నాను అని చెప్పాడు అంతే అనగా నువ్వు మధ్యలో మాట్లాడకు జగతి అని అంటుంది దేవయాని. నేను మహేందర్ తో మాట్లాడుతున్నాను రిషి మీద నీకు ఎటువంటి హక్కు లేదు ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అనడంతో ఫణీంద్ర మహేంద్ర ఆశ్చర్యపోతారు.