90 రోజుల్లో 3 కోట్లు ఖర్చు పెట్టిన సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌.. ఎందుకోసమంటే!

First Published Aug 3, 2020, 2:02 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రియా ఆర్ధిక లావాదేవిలకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో పలు వెబ్‌సైట్స్‌లో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ నేషనల్‌ వెబ్‌ సైట్‌ కథనం ప్రకారం గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లోసుశాంత్‌ ఎకౌంట్ నుంచి 5 దఫాలుగా పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినట్టుగా పేర్కొన్నారు.
undefined
ఆ కథనం ప్రకారం సుశాంత్ అకౌంట్‌లో 4.46 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌ ఉండగా మూడు నెలల తరువాత కేవలం కోటీ 40 లక్షల బ్యాలెన్స్ మాత్రమే ఉందని పోలీసులు గుర్తించినట్టుగా వెల్లడించారు. అయితే సుశాంత్ అకౌంట్‌ లోని డబ్బులో ఎక్కువ శాతం రియా, ఆమె కుటుంబ సభ్యులు వాడినట్టుగా వెల్లడించారు.
undefined
2019 అక్టోబర్‌ 14 నాటికి సుశాంత్ అకౌంట్‌ లో 4 కోట్ల 64 లక్షల బ్యాలెన్స్‌ ఉంది. ఆ రోజు 81,901 రూపాయలు రియా సోదరుడు షోవిక్‌ అకౌంట్‌కు బదిలీ అయ్యాయి. అక్టోబర్‌ 15న షోవిక్‌ ఢిల్లీ తాజ్‌ హోటల్‌ బిల్లుగా 4 లక్షల 30 వేల రూపాయలు సుశాంత్ అకౌంట్‌ నుంచే చెల్లించారు.
undefined
అక్టోబర్ 16న రియా, ఆమె సోదరుడికి సుశాంత్ అకౌంట్‌ నుంచే ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ అయ్యాయి. ఆ తరువాత కొద్ది రోజలు పాటు లక్షల రూపాయల రకరకాల రూపాల్లో ఖర్చయ్యాయి. నవంబర్ 14న లక్షన్నర రియా పేరిట ఖర్చయ్యింది.
undefined
నవంబర్‌ 20, 21న రియా.. మేకప్‌, షాపింగ్‌ కోసం 75 వేలు, నవంబర్‌ 24న మరోసారి రియా షాపింగ్ కోసం 22,220తో పాటు నవంబర్ 25న రియా సోదరుడి ట్యూషన్‌ ఫీజు కూడా సుశాంత్ అకౌంట్‌ నుంచే పే చేశారు.
undefined
అయితే సుశాంత్‌ కుటుంబ సభ్యులు మాత్రం రియా దాదాపు 15 కోట్ల రూపాయలు సుశాంత్ అకౌంట్‌ నుంచి ఖర్చు పెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ మేరకు సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ పూర్తిగా రియా కంట్రోల్‌లోకి వెళ్లిపోయాడని, సుశాంత్ క్రెడిట్ కార్డులు కూడా రియా దగ్గరే ఉండేవని ఆరోపించాడు.
undefined
అయితే సుశాంత్ సీఏ మాత్రం ఆయన అకౌంట్‌లో 15 కోట్ల ఉన్నాయన్న విషయాన్ని ఖండించారు. సుశాంత్ తన అకౌంట్‌ లోని డబ్బును ఆయనే ఖర్చు చేసేవాడని వెల్లడించాడు.
undefined
సీఏ సందీప్‌ శ్రీదర్‌ తెలిపిన వివరాల ప్రకారం, అందరూ చెబుతున్న భారీ మొత్తంలో సుశాంత్ దగ్గర డబ్బు లేదని, ఆయన ఇన్‌కం కూడా భారీగా ఏం లేదని తెలిపాడు. గత ఏడాదిలో ఇన్‌కం భారీగా తగ్గిందని తెలిపాడు. అయితే సందీప్‌ శ్రీధర్‌ను సుశాంత్ సోదరుడు షోవిక్‌ సుశాంత్ కు పరిచయం చేశాడని తెలిపారు.
undefined
ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రియాపై జూలై 31 కేసు నమోదు చేసింది. ఈ వారంలో ఆమెకు నోటీసులు అందుతాయని తెలిపారు. సుశాంత్ అకౌంట్‌లలోని అనుమానిత ఖర్చులపై రియాను ఆరా తీయనున్నారు.
undefined
click me!