దర్శకుడు చందూ ముండేటి శ్రీకృష్ణుడు నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటన.. వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్, కాల భైరవ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ కేర్ 5 నిమిషాల పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర 5 నిమిషాలే అయినప్పటికీ కృష్ణుడి గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయి.