'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' రివ్యూ..!

First Published Mar 29, 2019, 12:12 PM IST

సెన్సేషన్ కు పర్యాయపదంగా వర్మ మారారు. అప్పట్లో ‘శివ’ సినిమా రిలీజ్ అయ్యి..అన్ని విధాలుగా సెన్సేషన్ అయ్యింది. 

Review By- సూర్య ప్రకాష్ జోశ్యుల.. సెన్సేషన్ కు పర్యాయపదంగా వర్మ మారారు. అప్పట్లో ‘శివ’ సినిమా రిలీజ్ అయ్యి..అన్ని విధాలుగా సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత వర్మ దర్శకత్వంలో మరికొన్ని సినిమాలు సైతం ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేసాయి. అయితే గత కొంతకాలంగా ఆ మ్యాజిక్ జరగటం లేదు. దాంతో రివర్స్ లో ప్రయాణం పెట్టుుకున్నారు. అద్బుతంగా సినిమా తీసి సెన్సేషన్ అవటం అనే విషయం ప్రక్కన పెట్టి..సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనిపించే స్టోరీ లైన్ ని తీసుకుని సినిమాలు చేస్తున్నారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ తను సినిమా చేస్తానంటూ కర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే విలన్ గా చూపిస్తూ ... మరో మాజీ ముఖ్యమంత్రి జీవిత చరమాంకంలోని ఓ అధ్యాయం ఎంచుకుని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’రూపొందించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో.. రివ్యూలో చూద్దాం..
undefined
కథేంటి : 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి.. ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) ఒంటిరిగా నిరాశగా ఉంటారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. విద్యా సంపర్నురాలు అని ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌...తన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి ఓకే అంటారు. అలా మెల్లిగా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి.... కొద్ది రోజులకే ఆయన జీవితంలో భాగమైపోతుంది. యధావిధిగానే ఈ విషయం కొద్ది రోజుల్లోనే కుటుంబంలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దాంతో వాళ్లంతా ఆమెను ద్వేషించటం మొదలెడతారు. మరో ప్రక్క ఈ విషయమై బయిట కూడా దుష్ప్రచారం మొదలవుతుంది. ఎన్టీఆర్ తో ఆవిడ ఎందుకంత చ‌నువుగా ఉంటోంది? ఆ ఇంట్లోనే ఇద్దరూ ఎందుకు ఉంటున్నారు? అనే గుసగుసలు, రుసరుసలు ఎన్టీఆర్ దాకా వస్తాయి. దాంతో ఆయన ఈ విషయమై ఓ డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ లోగా తను నటించిగా సూపర్ హిట్టైన మేజర్ చంద్రకాంత్ సినిమా సక్సెస్ మీట్ ఫంక్షన్‌ కు హాజరు అవ్వాల్సి వస్తుంది. అక్కడికి ఆమెను తీసుకెళ్లిన ఎన్టీఆర్ .. ఆ వేదికపైనే తను లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటిస్తాడు. ఇది ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు కు గిట్టదు. దాంతో రావ్‌ ఓ పేపరు యజమాని తో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు.
undefined
అయితే అవేమీ ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపవు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తరువాత బాబు చక్రం తిప్పటం మొదలెడతారు.ఎన్టీఆర్ పై కోపంగా ఉన్న కుటుంబాన్ని తనవైపు తిప్పుకుని, బెదిరించి.. బాబు కుట్ర చేస్తాడు. పిల్లను ఇచ్చిన మామ అనే కనికరం లేకుండా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుంటాడు. ఆ తర్వాత పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌...తన అనుకున్న వాళ్ల చేతే .. వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయించుకోవటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. అలా ఓ గొప్ప వ్యక్తి చరమాంకం బాధగా ముగుస్తుంది.
undefined
ఎలా ఉంది : ఇందులో చూపబడ్డ లేదా చర్చించబడ్డ విషయాలు నిజమా.. అబద్దమా అనేది ప్రక్కన పెడితే..ఈ సినిమా ఓ వర్గం రాజకీయ అవసరాలకు అణుగుణంగా రూపొందించబడిందని అర్దమవుతుంది. అలా కాకపోతే ఇప్పుడీ సినిమా తీయాల్సిన అవసరం కానీ.. జనాలకు పనిగట్టుకుని ఈ విషయాలు తెలియాల్సిన అవసరం కానీ కానీ ఏమీ లేవనేది సుస్పష్టం. అందరికీ తెలిసిన విషయాలను మరోసారి గుర్తు చేయటమే ఈ సినిమా చేసిన పని. అయితే వెర్బల్ కన్నా విజువల్ ఇంపాక్ట్ అనేది కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా మందికి తెలిసిన విషయాలనే వర్మ ఎలా డీల్ చేసారన్నదే ప్రధానాంశం. ఆ విషయంలో వర్మ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కొన్ని చోట్లు కంటిన్యూగా అవే పాత్రల మధ్య అదే డ్రామా పండిచటం, ఎదర ఏం జరగబోతోందో తెలియటం వంటివి కొంత బోర్ కొట్టిస్తాయి. కానీ టోటల్ గా ఎంగేజింగ్ గానే ఉంది.
undefined
ఇక `థాంక్స్ టు బాల‌య్య‌` అంటూ మొదట్లో టైటిల్ కార్డ్ వేసి నవ్వించిన ఆర్జీవి ఆ తర్వాత అంతా సీరియస్ కథనమే నడిపించారు. తన వాయిస్ ఓవర్ తో కథలోకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి లక్ష్మీ పార్వతి ఎంట్రీ, చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ‌, పురంధేశ్వ‌రి పాత్రల పరిచయం..వాళ్లు ల‌క్ష్మీ పార్వ‌తిని తో బిహేవ్ చేసే తీరు వంటి స‌న్నివేశాలుతో ముందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని ప్రక్కన పెట్టమని అల్లుడు బాబు వార్నింగ్ ఇవ్వటం, కలత చెందిన ఎన్టీఆర్ కు హార్ట్ స్ట్రోక్ రావటం జరుగుతుంది. దాని నుంచికోలుకుని... మేజ‌ర్ చంద్ర‌కాంత్ స‌క్సెస్ మీట్ లో ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లాడుతాన‌ని ప్ర‌క‌టించ‌డంతో అస‌లు కథ మలుపు తిరుగుతుంది. ఎన్టీఆర్ `సింహ‌గ‌ర్జ‌న` ఎపిసోడ్.... చంద్ర‌బాబు వెన్నెపోటు వంటివి సెకండాఫ్ ని రక్తి కట్టించాయి.. వైశ్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ తో సినిమాకు ముగింపు ఇచ్చారు. అయితే ఈ మొత్తాన్ని స్లో నేరేష‌న్ తో నడపటమే ఇబ్బందిగా అనిపిస్తుంది.
undefined
లక్షణంగా లక్ష్మీ పార్వతి : ఇది లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తీయటం వల్లనో ఏమో కానీ...మొదటి నుంచీ ఆమెను, ఆమె చర్యలను జస్టిఫై చేస్తూ సాగుతుంది. లక్ష్మీ పార్వతిపై అందరూ నిందలు వేసి,నీచ మార్గంలో ఆమెను ఎన్టీఆర్ నుంచి దూరం చేయటానికి ప్రయత్నించారని.. ఆమెవైపు సానుభూతి వచ్చేలా చేస్తుంది. అందుకు తగ్గ సన్నివేశాలు, డైలాగులతో సినిమాని వర్మ రక్తి కట్టించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఓ అమాయకురాలైన లక్ష్మీ పార్వతి అనే ఆమెను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, రామోజీరావు కలిసి ఎలా ఎన్టీఆర్ ఇమేజ్ ని దెబ్బకొట్టారు అనేదే ప్రధాన ప్రస్తావగా ఉంటుంది. (అంటే ఆమె తన పుస్తకంలో తన గురించి అలాగే రాసుకుని ఉంటుంది)
undefined
చంద్రబాబు పాత్ర ఎలా ఉంది : ఇక ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో చంద్రబాబు నాయుడుని అంతలా చూపెడతారని ఊహించం. ఆయనపై పగ లేదా కక్ష పెంచుకున్నట్లుగా ఆ పాత్రను చాలా దుర్మార్గంగా డిజైన్ చేసారు.
undefined
వర్మ బలం : తొలి నాటి నుంచి వర్మ బలం ..ఒకటే అది ...తన సినిమాల్లో పాత్రల స్ట్రాంగ్ క్యారక్టరైజేషన్. అలాగే దాదాపు ప్రతీపాత్రకు బలమైన ఇంటెన్షన్ ఉంటుంది. అదే సినిమాను మొదటి నుంచి చివర వరకూ లాక్కెళ్లిపోతుంది. అదే ఈ సినిమాలోనూ మనకు కనిపిస్తుంది. అటు లక్ష్మీ పార్వతి, ఇటు చంద్రబాబు, ఎన్టీఆర్ ఈ మూడు పాత్రలను చాలా కన్విక్షన్ తో రాసి, తీసారు. వాటితో తెలిన కథలో కూడా కొత్త ఇంటెన్సిటీ క్రియేట్ అయ్యి డ్రామా బాగా పండింది.
undefined
కలిసొచ్చిన కథనం : ఈ సినిమాకు వర్మ చేసిన స్క్రీన్ ప్లే ...కథలోకి వేగంగా వెళ్లేలా చేసింది. మొన్నీ మధ్యన వచ్చిన ఈవెంట్ బేసెడ్ పొలిటికల్ డ్రామా ..యాత్ర లాగ..ఈ సినిమా కూడా ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘట్టాన్ని మాత్రమే చూపిస్తుంది. ప్రక్కకు పొరపాటున కూడా వెళ్లదు. చాలా కాలంగా జన సామాన్యంలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న వెన్నుపోటు అంశం చుట్టూనే సీన్స్ ఉంటాయి. ఆ ఘట్టాన్ని ఎలివేట్ చేసేందుకు మిగతా సన్నివేశాలు సహకరించేలా ప్లాన్ చేసారు. అది కత్తిమీద సామే కానీ కదన కుతూహలం కలిగిస్తుంది. విపరీతంగా ఎక్సైట్ చేయటం లేదా భయంకరంగా బోర్ కొట్టడం రెండూ లేవు.
undefined
ఎపిసోడిక్ : అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు చిన్న పాటి ఇబ్బందిగా అనిపిస్తుంది. అది స్లో నేరేషన్ వల్ల కావచ్చు . లేదా కథ లేకుండా కేవలం ఎపిసోడ్స్ తో అదీ అందరికీ తెలిసిన అంశాలతో అల్లిన కథనం వల్ల కావచ్చు.
undefined
వాళ్లని హర్ట్ చేస్తాయి : చంద్రబాబు పాత్రను అందరూ ఊహించినట్లుగానే బాగా చెడ్డవాడిగా..విలన్ గా చిత్రీకరించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఎలా అధికారాన్ని చంద్రబాబు లాక్కున్నాడనేది సినిమా మొత్తం సాగే విషయం. ఆ సన్నివేశాలు చూపటంలో వర్మ తన ప్రతిభను మొత్తం వాడారు. ఖచ్చితంగా అలాంటి సన్నివేశాలు సగటు తెలుగుదేశం అభిమానిని హర్ట్ చేసేవే. ఈ సినిమాని కేవలం ఎన్టీఆర్ అనే ప్రముఖ వ్యక్తి జీవితంలో జరిగిన విషయంగానే కాకుండా... ఓ వ్యక్తి జీవితంలోకి మరొకరు ప్రవేశించినప్పుడు ఆ కుటుంబం ఎలా స్పందిస్తుంది..అధికారం కోసం కుటుంబంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి,కడుపున పుట్టిన వాళ్లు కూడా శత్రువులులాగ ఎలా మారతారు అనే మానవ నైజంకు సంభందించిన విషయాల సమాహారంగా చూసినా ఈ సినిమా ఇంట్రస్టింగ్ గా ఉండే అంశమే.
undefined
నటీనటులు : ఈ సినిమాలో ఎన్టీఆర్ గా నటించిన విజయ్ కుమార్ ...కావాల్సిందానికన్నా కాస్త ఎక్కువ మెలోడ్రామానే పండించారు. డైలాగుల్లోనూ డ్రామా చూపించారు.అఫ్ కోర్స్ రాజకీయాల్లోకి వచ్చాక..ఎన్టీఆర్ డైలాగు డెలవరీ కూడా డ్రామా తో మిళితమై ఉండేది. అదే అనుకరించినట్లున్నారు. కానీ అది అప్పుడు చెల్లుబాటైంది కానీ ఇక్కడ కాస్త అతిగా అనిపించింది. లక్ష్మీ పార్వతి యజ్ఞ శెట్టి బాగా చేసింది. వంక పెట్టలేం. చంద్రబాబుగా శ్రీ తేజ గా చాలా భాగం ఆయన్ను గుర్తు చేసారు. మిగతా వాళ్లు సో..సో...వాళ్ల గురించి , వాళ్ల నటన గురించి పెద్దగా మాట్లాడేదేమీ లేదు. వర్మ వాళ్లను ఎలా తీసుకున్నారా అనిపిస్తుంది.
undefined
బాలయ్య మీద కోపం : వర్మకు బాలయ్య ..బయోపిక్ ఛాన్స్ ఇవ్వలేదనో లేక మరెందుకో కానీ బాగా కోపంగా ఉన్నట్లున్నారు..ఆ విషయం మనకు స్పెషల్ ధాంక్స్ టు బాలయ్య అని వేయటంలో అర్దమవుతుంది.
undefined
క్లారిటీ ఇవ్వలేదు : సినిమా లో ప్రధాన పాత్ర లక్ష్మీ పార్వతి , ఆమె వివాహం, తదితర పరిణామాలు అయ్యినప్పుడు..ఏ ఇంటెన్షన్ లేకుండా ఎందుకు మొదటి భర్తని, కొడుకుని వదిలేసి వచ్చి ఎన్టీఆర్ ని వివాహం చేసుకుంది అనే విషయమై వర్మ క్లారిటీ ఇవ్వలేదు.
undefined
ఎన్టీఆర్ కుటుంబం : ఎన్టీఆర్ కుటుంబాన్ని విలువ లేనివారిగా, విలువలు వదిలేసిన వారిగా ఎందుకు మారారు.. ఎందుకు తన తండ్రిపై అంత కక్ష కట్టి, అంత క్రూరత్వంగా బిహేవ్ చేసారనేది అర్దం కాదు..
undefined
టెక్నికల్ గా : ఈ సినిమా వర్మ మార్క్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రిచ్ గానే ఉంటుంది. కాకాపోతే సినిమానే మరీ లో బడ్జెట్ లో చుట్టేసారని సగం చూసేసరికి అర్దమైపోతుంది. కళ్యాణ్ మాలిక్ దాదాపు ఈ సినిమాని నిలబెట్టారు. వర్మ వాయిస్ ఓవర్ కూడా ఈ సినిమాలో బాగుంది. అయితే ఎన్టీఆర్ మీద వర్మకు గౌరవం ఉంటే ఇందులో కొన్ని డాన్స్ మూమెంట్స్, సీన్స్ అయితే ఖచ్చితంగా చోటు చేసుకోవు...సినిమాగా ఇది కేవలం ఎలక్షన్ టైమ్ లో వచ్చిన ఎన్నికలచిత్రంగానే భావించాలి. వర్మ టాలెంట్ కోసమో ..మరొకరి ప్రతిభ ప్రదర్శన కోసమో ఈ సినిమాని చూపలేం. అప్పట్లో వచ్చిన మండలాధీసుడు చిత్రం ఎంతో ఇదీ అంతే.
undefined
ఫైనల్ గా : ద‌ర్శ‌కుడిగా ఆర్జీవీ మొదటి నుంచి ఏం చెప్పాడో అది తీయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తేనే చూసే మనం దెబ్బ తింటాం.
undefined
రేటింగ్: 2.55
undefined
click me!