సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు కొట్టేసిన రియా చక్రవర్తి!

First Published | Jul 29, 2020, 12:33 PM IST

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి నెలన్నర పైనే అవుతున్నా ఇంకా అతడి మృతికి సంబంధించిన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌, సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా మీద కంప్లయింట్‌ ఇవ్వటంతో కేసు కీలక మలుపు తిరిగింది. 

Rhea Chakraborty accused of making a transaction of rs 15 crores from Sushants bank account
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు సరికొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి మీద పాట్నాలోని రాజీవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Rhea Chakraborty accused of making a transaction of rs 15 crores from Sushants bank account
తన కంప్లయింట్‌లో కేకే సింగ్‌, రియా మీద తీవ్ర ఆరోపణలు చేశారు. సుశాంత్ బాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోవాలనుకున్నాడని, కేరళలో ఆర్గానిక ఫామింగ్‌ చేస్తూ స్థిరపడాలనుకున్నాడని కేకేసింగ్ వెల్లడించారు. కానీ రియా అతడిని ఆపేసిందని, కేరళ వెళ్లకుండా ఆపిందని ఆయన ఆరోపించాడు.

సుశాంత్ బ్యాంక్‌ ఎకౌంట్‌లో 17 కోట్ల డబ్బు ఉందని, కానీ ఒక్క నెలలోనే అందులో 15 కోట్లు ఇతర ఎకౌంట్లకు బదిలీ అయ్యాయని ఆయన తెలిపాడు. అయితే అందులో రియా, ఆమె సహచరులు ఎంత మొత్తం దోచుకున్నారో తేల్చాలని ఆయన పోలీసులను కోరారు.
సుశాంత్ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న సమయంలో అతన్ని రియా తన ఇంటికి తీసుకెళ్లిందని, మెడిసిన్స్‌ తప్పుగా ఇవ్వటం మూలంగా సుశాంత్ ఆరోగ్యం పాడైందన్నారు. అయితే రియా మాత్రం అందరికీ సుశాంత్‌కు డెంగ్యూ ఫీవర్‌ వచ్చిందని చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సుశాంత్ సినిమాల ఎంపికలోనూ రియా చాలా ఒత్తిడి చేసేదని కేకే సింగ్ తన కంప్లయింట్‌లో పేర్కొన్నారు. ఓ సినిమా ప్రపోజల్ వస్తే.. ఆ సినిమాలో సుశాంత్‌కు జోడిగా తనకు అవకాశం ఇస్తేనే సినిమా అంగీకరించాలని ఒత్తిడి చేసేదని ఆయన వెల్లడించారు.
సుశాంత్‌కు నమ్మకంగా ఉన్న పాత స్టాఫ్‌ను కూడా రియానే తొలగించిందని, తనకు అనుకూలంగా ఉండేవాళ్లను సుశాంత్ దగ్గర ఉద్యోగానికి పెట్టిందని తెలిపారు. వారి ద్వారా రియా, సుశాంత్‌ కంట్రోలో చేయటం మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు.
గతంలో రియా తనను ఎలా వేదిస్తుందో సుశాంత్ తన అక్కకు వివరించాడని కేకే సింగ్ తెలిపారు. రియా, సుశాంత్‌ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ అన్నీ తీసుకొని తనను వేదిస్తుందని సుశాంత్‌ చెప్పాడని తెలిపారు. మీడియాకు సుశాంత్ పిచ్చివాడయ్యాడని చెప్పి అవకాశాలు రాకుండా చేస్తుందని సుశాంత్‌ భయపడేవాడని సుశాంత్ తండ్రి తెలిపారు.
సుశాంత్ ముంబైలో ఉండేందుకు ఇంట్రస్ట్ చూపించకపోవటంతో జూన్‌ 6 రియా అతడ్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిందని ఆ సమయంలో తనతో పాట భారీగా డబ్బు, నగలు, క్రెడిట్‌ కార్డ్స్‌, విలువైన పత్రాలు, లాప్‌ టాప్‌, మెడికల్‌ రికార్డ్స్‌ కూడా తీసుకెళ్లిందని తెలిపారు. సుశాంత్ నెంబర్‌ను కూడా ఆమె బ్లాక్‌ చేసిందని ఆయన తెలిపారు.
2019లో రియా చక్రవర్తిని కలవడానికి ముందు సుశాంత్ కు ఎలాంటి మానసిక సమస్య లేదని, కానీ ఆమెను కలిసిన తరువాత సుశాంత్ మానసిక పరిస్థితి ఎందుకు దిగజారిందో ఇన్వెస్టిగేట్ చేయాలని ఆయన కోరారు.
అంతేకాదు రియా మానసిక వేదించి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన తండ్రి కృష్ణ కుమార్‌ సింగ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ముంబైలో సుశాంత్ లైఫ్‌ స్టైల్‌, అలవాట్లు, ఇతర వివరాలన్నింటినీ కేకే సింగ్ పోలీసులకు అందించినట్టుగా తెలిపారు.
ఈ కేసులో రియా చక్రవర్తితో పాటు సంధ్య చక్రవర్తి, షోబిక్‌ చక్రవర్తి, ఇంద్రజిత్‌ చక్రవర్తి, సామ్యూల్‌ మిరాండ, శృతి మోడీల మీద కూడా ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేసినట్టుగా వెల్లడిచారు.

Latest Videos

click me!