ఎప్పుడో తప్పు తెలుసుకుంటారు అప్పుడు పరిస్థితులు వాళ్ల చేతిలో ఉండవు ఇకమీదట దీని గురించి ఆలోచించకు అని ప్రశ్నతో చెప్తాడు గౌతమ్. నేను నిరాశ పడలేదు సార్ చిన్న ఆశా రేఖ కోసం చూస్తున్నాను. కచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుంది నందిని జీవితం బాగుంటుంది అంటుంది కృష్ణ. మరి నీ జీవితం ఏం కావాలి, నీ కాపురం ఏమైపోవాలి అంటూ సడన్గా అక్కడికి వస్తుంది రేవతి. ఒక్కసారిగా రేవతిని చూసి షాక్ అవుతారు గౌతమ్, కృష్ణ. తరువాయి భాగంలో పంతం కోసం ఎంత దూరమైన వెళ్తానని తెలిసి కూడా నాతో పంతం పట్టింది నేను ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోను అంటుంది భవాని. అదే మాట గౌతమ్ తో చెప్తుంది కృష్ణ. గౌతమ్, కృష్ణ, నందిని పెళ్లి దగ్గరికి వచ్చి అందరికీ షాకిస్తారు.