రేణు దేశాయ్ కూడా షాక్.. ఆమె కోసం ఏ హీరో చేయని పని చేసిన బాలకృష్ణ, అది కదా గొప్ప మనసు

First Published | Jan 9, 2025, 7:33 AM IST

నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. మనసుకి అనిపించింది చెప్పడం, అభిమానులపై చేయి చేసుకోవడం లాంటివి బాలయ్య నుంచి చూస్తూనే ఉన్నాం.

నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. మనసుకి అనిపించింది చెప్పడం, అభిమానులపై చేయి చేసుకోవడం లాంటివి బాలయ్య నుంచి చూస్తూనే ఉన్నాం. దీనితో బాలయ్యకి కోపం ఎక్కువ అని కూడా చాలా మంది భావిస్తుంటారు. అయితే బాలయ్య గొప్ప మనసు గురించి అనుభవం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 

బాలయ్య గురించి ఒక విషయం తెలుసుకుని నటి రేణు దేశాయ్ కూడా ఆశ్చర్యపోయారు. ఉదయభాను టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకర్ గా వెలుగు వెలిగింది. ఇటీవల ఆమె ప్రభావం తగ్గింది. ఉదయభానుకు బాలకృష్ణ అంటే అమితమైన అభిమానం. స్టేజిపైకి వెళ్లి మైక్ పట్టుకుందంటే బాలయ్య గురించి ఒక రేంజ్ లో ఉదయభాను ఎలివేషన్ ఇస్తుంది. 


రేణు దేశాయ్ జడ్జిగా పాల్గొన్న నీతోనే డ్యాన్స్ అనే షోలో ఉదయభాను బాలయ్య గురించి ఒక సంఘటన వివరించారు. బాలయ్య గొప్ప మనసు గురించి చెబుతూ ఉదయభాను కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి రేణు దేశాయ్ కూడా షాక్ అయ్యారు. నా పిల్లల పుట్టిన రోజుకి హాజరు కావాలని బాలయ్యకి మెసేజ్ పెట్టాను. అరగంట తర్వాత బాలయ్య నాకు ఫోన్ చేశారు. ఉదయభాను నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను తప్పకుండా వస్తాను అని చెప్పారు. 

చెప్పిన టైం ఆయన బర్త్ డే ఫంక్షన్ కి హాజరయ్యారు. ఆయన నడచి వస్తుంటే సింహం వచ్చినట్లే ఉంది. కానీ నాకు మాత్రం దేవుడు వస్తున్నట్లు అనిపించింది అంటూ ఉదయభాను వెక్కి వెక్కి ఏడ్చేశారు. అది చూసిన రేణు దేశాయ్ చప్పట్లు కొడుతూ అభినందించారు. అందరి హీరోల్లాగా బాలయ్య 5 నిమిషాలు ఫార్మాలిటీకి ఉంది వెళ్లిపోలేదు. బర్త్ డే ఫంక్షన్ లో 45 నిమిషాలు ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఫోటో దిగారు. బాలయ్య లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు అంటూ ఉదయభాను ప్రశంసలు కురిపించింది. 

మరో మూడు రోజుల్లో బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సంక్రాంతికి తన మాస్ యాక్షన్ తో అలరించడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో నటించారు. 

Latest Videos

click me!